
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన "బ్రహ్మోత్సవం" బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే 2013లో ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా స్టోరీ లైన్ తో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని తీశాడు.. కానీ రిజల్ట్స్ మాత్రం పూర్తిగా తారుమారైంది. దాదాపుగా రూ.75 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించగా రూ.50 కోట్లు (గ్రాస్) మాత్రమే బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది.
అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిన విషయంపై డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రీసెంట్ గా స్పందించాడు. ఇందులో భాగంగా ట్రెండ్ కి తగ్గట్టుగా స్టోరీ లేకపోవడం, అలాగే పేపర్ మీద రాసుకున్న స్టోరీని గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో తీయలేకపోవడం వంటవి బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణమయ్యాయని చెప్పుకొచ్చాడు.
Also Read :- ఫొటో షూట్లతో హీట్ పెంచేస్తున్న చిట్టి... కానీ ఆఫర్లు మాత్రం రావడం లేదా..?
ఈ సినిమానే కాదు చాలా శాతం సినిమాలు సరైన స్టోరీ లేకపోవడంవల్లే ప్లాప్ అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఫెయిల్యూర్ గురించి మాట్లాడితే ప్రతీది కారణమవుతుందని కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడకపోవడమే మంచిదని చెప్పుకొచ్చాడు. కానీ ఈ సినిమాతో మంచి గుణపాఠం నేర్చుకున్నానని అందుకే ట్రెండ్ కి తగ్గట్టుగా ఆలోచిస్తూ కథలు ఎంచుకుంటున్నానని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆమధ్య పెదకాపు అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయింది. దీంతో ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల ఓ కీలక పాత్రలో కూడా నటిస్తున్నాడు.