టాలీవుడ్ ని లీక్ ల బెడద పీడిస్తోంది. ఇటీవలే మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ లుక్ పిక్స్ లీక్ అయిన విషయం మరువకముందే మరో ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. అయితే దసరా మూవీ ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ని గుర్తు తెలియని వ్యక్తులు లీక్ చేశారు.
దీంతో ఈ విషయంపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో స్పందించాడు. ఇందులోభాగంగా "నా సినిమాకే కాదు, ఎవరి సినిమాలో ఏ లీక్ అయినా అసిస్టెంట్ డైరెక్టర్స్ లేదా రైటర్స్ ని బ్లేమ్ చేయడం మానేస్తే బెటర్ అని అన్నారు. అలాగే వీళ్ళు ఫ్యూచర్ క్రియేటర్స్ అని, సినిమాకి నిస్వార్థంగా పని చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కష్టపడి పనిచేసే సినిమా డిపార్ట్మెంట్లపై నిందలు వేసే అలవాటును మార్చుకోండి మరియు మీ అత్యాశను ఒప్పుకోవడం నేర్చుకోండంటూ హెచ్చరించాడు. ఇక నా సినిమా టైటిల్ ని లీక్ చేసింది నా టీమ్ లోని వ్యక్తులు కాదని, ఆ వెధవలు ఎవరో నాకు తెలుసని ఎక్స్ లో ట్వీట్ చేశాడు. అలాగే ఈ ట్వీట్ కి ది ప్యారడైస్ సినిమా టైటిల్ ని హ్యాష్ గా ట్యాగ్ చేస్తూ టైటిల్ పోస్టర్ ని షేర్ చేశాడు.
Also Read : సమంత సిటాడెల్ ఎలా ఉందంటే.?
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నాని-శ్రీకాంత్ ఓదెల సినిమా పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. గతంలో నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో అదే సినిమా క్రూ తో నాని నెక్ట్స్ సినిమాని అనౌన్స్ చేశాడు. కానీ ఇంతలోనే ఈ లీక్ ది ప్యారడైస్ టీమ్ కి షాక్ ఇచ్చింది.
To whomever it may concern,
— Srikanth Odela (@odela_srikanth) November 10, 2024
నా సినిమాకే కాదు, ఎవరి సినిమా లో ఏ లీక్ అయినా ASSISTANT DIRECTORS or WRITERS ని blame చేయడం మానేస్తే better.
These people are the future creators and their selfless contribution to cinema deserves utmost RESPECT!
Change the habit of blaming it on… pic.twitter.com/xoO3gLCANp