
దసరా (Dasara) లాంటి రా అండ్ రస్టిక్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth odela). హీరో నాని (Nani)తో మొదటి సినిమాతోనే, తన సత్తా చాటుకొని బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టాడు ఈ కుర్ర దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు.
అప్పటినుండి ఈ దర్శకుడు నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. అది సెన్సేషనల్ అవుతుంది. అందులో భాగంగానే ఇటీవలే నానితో తన రెండో సినిమా 'ది ప్యారడైజ్' టైటిల్ అండ్ టీజర్, రిలీజ్ చేసి హాట్ టాపిక్ మారిపోయాడు. అంతేకాకుండా తన మూడో సినిమా మెగాస్టార్తో అనౌన్స్ చేసి మరింత టాక్ అఫ్ ది టాలీవుడ్ డైరెక్టర్గా నిలిచాడు.
Also Read : గ్రాండ్గా పెళ్లి రిసెప్షన్.. నమ్రత ఫోటోలు షేర్
ఇదిలా ఉండగానే.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా సడెన్గా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. 'సమ్మక్క సారక్క క్రియేషన్స్’ పేరుతో ఓ కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి, టాలెంటెడ్ టీంతో కలిసి కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. లేటెస్ట్గా (మార్చి 10న) ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను అనౌన్స్ చేశాడు. ‘అల్ అమీనా జారియా రుక్సానా'స్ గులాబీ’ అంటూ ఆడియన్స్లో ఆసక్తి రేపాడు.
ఈ పోస్టర్‌లో నల్లటి చీరలో ఒక అమ్మాయి సరిహద్దు వెంట నడుస్తున్నట్లు, ఎర్ర గులాబీలు చెల్లాచెదురుగా ఉన్నాయి. ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించే అమ్మాయి యొక్క లోతైన భావోద్వేగాలను చూపించే కోణంలో పోస్టర్ కనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా2009లో గోదావరిఖనిలో జరిగిన నిజజీవిత సంఘటన ఆధారంగా రూపొందించబడిన హృద్యమైన ప్రేమకథగా రానున్నట్లు సమాచారం.
ఈ మూవీను శ్రీకాంత్ ఓదెలాతో పాటు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రల 'చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్' కలిసి నిర్మించనున్నాయి. ఓదెల ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా కథను కూడా అందిస్తున్నారు, దీనిని నూతన దర్శకుడు చేతన్ బండి రచించి దర్శకత్వం వహించారు.
I'm just trying to follow in your footsteps Anna.
— Srikanth Odela (@odela_srikanth) March 10, 2025
Em chesina nuv unnav ane dhairyam.
Thank you @NameisNani annnaaaa❤️ https://t.co/xm12uAOscC