Venky sequel: మీమ్ లవర్స్ గెట్ రెడీ.. వెంకీ సీక్వెల్పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

మాస్ మహారాజ రవితేజ(RaviTeja) హీరోగా వచ్చిన సూపర్ హిట్ వెంకీ(Venky) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, బాబ్జి తదితరులు కీ రోల్స్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ చాలానే ఉన్నాయి.

మరీ ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవల్ అంతే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ మొత్తం దాదాపు వెంకీ సినిమా నుండే ఉండటం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే మీమర్స్ కి వెంకీ సినిమా ఒక డిక్షనరీ లాగా. అందుకే ఈ సినిమాకుక్ సీక్వెల్ కావాలని చాలా మంది అడుగుతూనే ఉన్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించాడు దర్శకుడు శ్రీను వైట్ల. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. వెంకీ సినిమా రీ రిలీజ్ టైంలో రెస్పాన్స్ చూసి నాకు ఆశ్చర్యమేసింది. అప్పుడే వెంకీ సీక్వెల్ చేయాలని ఆలోచన వచ్చింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశాము. కానీ, ఈ సీక్వెల్ అదే స్టార్స్ తో ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేను అని చెప్పుకొచ్చారు శ్రీను వైట్ల. 

ALSO READ :- Bhimaa OTT: OTTకి వచ్చేస్తున్న సూపర్ హిట్ భీమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

ప్రస్తుతం ఆయన హీరో గోపీచంద్ తో ఓ యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షెరవేగంగా జరిగుతోంది. నిజానికి ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్షా మూవీ తరువాత దర్శకుడు శ్రీను వైట్లకు సరైన హిట్టు లేదు. ఆ తరువాత ఆయన.. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి సినిమాలు చేశాడు.కానీ, ఆయనకు హిట్టు మాత్రం వరించలేదు. మరి  చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్లకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందించనుందో చూడాలి.