శ్రీనువైట్ల గతంలో డైరెక్ట్ చేసిన అమర్ అక్బర్ ఆంథోని చిత్రం ఫ్లాప్ పై స్పందించాడు. ఇందులో భాగంగా 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా తానూ డిప్రెషన్ లో ఉన్నప్పుడు తీశానని ఆ సమయంలో ఈ చిత్రం చెయ్యకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ చిత్రం ఆడియన్స్ కి నచ్చకపోయినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయని దీంతో ప్రొడ్యూసర్స్ సేఫ్ అయ్యారని తెలిపాడు. ఈ ప్రభావం దర్శకుడు శ్రీనువైట్ల కెరీర్ పై మాత్రం గట్టిగానే పడింది. దీంతో అమర్ అక్బర్ ఆంథోని చిత్రం తర్వాత నెక్స్ట్ సినిమా చెయ్యడానికి దర్శకుడు శ్రీనువైట్లకి దాదాపుగా 6 ఏళ్ళు పట్టింది.
ఇటీవలే శ్రీనువైట్ల తెలుగలో ‘విశ్వం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ప్రముఖ హీరో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించారు. 6 ఏళ్ళ తర్వాత మెగా ఫోన్ పట్టిన శ్రీను వైట్ల మళ్ళీ కామెడీ మరియు యాక్షన్ ఎమోషన్స్ ని విశ్వం చిత్రంలో చూపించాడు. దీంతో ఈ చిత్రం మంచి హిట్ అయ్యి డైరెక్టర్ శ్రీనువైట్ల హిట్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు భావిస్తున్నారు.
ALSO READ | మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ విడుదల.. నాన్నకోసం చేస్తే తప్పు కాదు..
ఒకప్పుడు దర్శకుడు శ్రీనువైట్ల టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, మాస్ మహారాజ రవితేజ తదితర స్టార్ హీరోలతో సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించాడు. కానీ ప్రస్తుతం సక్సస్ లేక కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు.