టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli). అలాగే ప్రతి ఒక్కరి కలల రాజకుమారుడిగా గుర్తింపు పొందారు మహేష్ బాబు (Mahesh Babu). దీంతో వీరిద్దరి SSMB29 ప్రాజెక్ట్పై చిన్న న్యూస్ తెలిసిన చాలు..అది మాకు ఎంతో సంతోషం అంటూ సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటనేది వివరాల్లోకి వెళితే..
సహజంగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారంటే నాలుగు లేదా ఐదు సంవత్సరాల అయినా పడుతుందనే విషయం తెలిసిందే. అలానే ప్రభాస్ అతి ముఖ్యమైన తన ఐదేళ్ల కాలాన్ని బాహుబలి మూవీకి అంకితం చేసి వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాడు. ఇలా రాజమౌళి ఓ సినిమా తీశాడంటే..తనతో పాటు ఆ హీరోలను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాడు. అయితే.. తెరకెక్కించే సినిమాలకు చాలా టైం వెచ్చిస్తాడని కూడా టాక్ ఉంది.
ఈ క్రమంలో మహేష్ చేసే సినిమాకు కూడా ఓ నాలుగేళ్ల కాలం పట్టకతప్పదు. ఇక మహేష్ నెక్స్ట్ మూవీ చేయాలంటే టైం పడుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాస్తా ఆందోళనలో ఉన్నారు..అదే టైంలో దర్శకధీరుడితో సినిమా అంటూ అంచనాలతో ఉన్నారు. ఐతే.. ఇప్పుడు ఆ ఆందోళన ఏ మాత్రం అవసరం లేదని న్యూస్ బయటికొచ్చింది.
మహేష్ బాబు సినిమా కోసం షూటింగ్ ప్రాసెస్‌ని డైరెక్టర్ రాజమౌళి రివర్స్ చేసాడట. ఈసారి ముందు విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసి.. తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారట రాజమౌళి. కాగా ఇప్పటికే 40శాతం వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తయిందని టాక్. దీన్ని బట్టి ఈ సినిమా రాజమౌళి గత చిత్రాల్లా కాకుండా.. త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దాంతో సూపర్ ఫ్యాన్స్ కు ఇంకేం కావాలి.
కాగా ఇటీవలే రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ (SS Karthikeya) రాజమౌళి ఫారెస్ట్ మధ్యలో జీప్లో కూర్చొని ప్రయాణం చేస్తోన్న వీడియోని.. షూట్ చేసి ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు కూడా. ఇక త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.