డిమాండ్‌ ఇదే: మార్చి 22 కోసం ఎదురుచూస్తున్నా.. అభిమానుల సపోర్ట్‌ కోరుతూ రాజమౌళి వీడియో రిలీజ్

డిమాండ్‌ ఇదే: మార్చి 22 కోసం ఎదురుచూస్తున్నా.. అభిమానుల సపోర్ట్‌ కోరుతూ రాజమౌళి వీడియో రిలీజ్

ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీతకారుడు ఎం.ఎం. కీరవాణి మ్యూజికల్ కన్స‌ర్ట్ (మార్చి 22న) సాయంత్రం 7గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గ్రాండ్ ఈవెంట్‌ జరగనుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) X వేదికగా తన డిమాండ్‌ వినిపించారు. అంతేకాకుండా అభిమానుల సపోర్ట్‌ సైతం కోరారు. ఇంతకీ రాజమౌళి కోరిన డిమాండ్‌ ఏంటీ? అనే వివరాలు చూద్దాం..

రాజమౌళి వీడియోలో మాట్లాడుతూ.. "మార్చి 22 కోసం నేను చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు అన్న‌య్య ఎం.ఎం. కీరవాణి (Na Tour MMK) మ్యూజికల్ కన్స‌ర్ట్ ఉంది. ఈ క‌న్స‌ర్ట్‌లో నా సినిమాలోని సాంగ్స్ తో పాటు ఆయ‌న మ్యూజిక్ అందించిన పాట‌ల‌ను కూడా పాడ‌నున్నారు. అయితే, నా డిమాండ్ ఏంటంటే ఈ క‌న్స‌ర్ట్‌లో ఆయ‌న ఒ.ఎస్‌.టి (ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్‌) లూ ఉండాలనేది నా డిమాండ్‌.

ఎందుకంటే ఆయన రీ రికార్డింగ్‌ అద్భుతంగా ఉంటుంది. ఆయన పాట‌లు ఎంత ఫేమ‌సో.. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ కూడా అంతే ఫేమ‌స్. అందువల్ల ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ల‌ను, ఒ.ఎస్‌.టి ల‌ను లైవ్‌లో ప్లే చేయాలని కోరుకుంటున్నా" అంటూ రాజ‌మౌళి చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం రాజమౌళి తన నెక్స్ట్ మూవీని (SSMB 29) సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.దాదాపు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ SSMB 29 నిర్మిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగాన్ని 2027లో, రెండవ భాగాన్ని 2028లో విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నారు.