SSRMB29: మహేష్-రాజమౌళి మూవీ..ఇవాళ కాన్సెప్ట్ వీడియో రానుందా..క్లారిటీ !

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, అది కూడా సూపర్ స్థార్ మహేష్ బాబుతో అవడంతో ఈ సినిమాపై ముందు నుండే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రతీ ఒక్కటి సెట్ చేస్తున్నారు మేకర్స్.  

ఇవాళ ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో రాజమౌళి సినిమా నుంచి అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే చాలా రోజుల నుంచి వినిపిస్తోన్న ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.ఆగస్ట్‌ 9న మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా SSRMB 29 సినిమాకు సంబంధించిన తొలి ప్రెస్‌మీట్‌ను మేకర్స్‌ నిర్వహించనున్నారని. ఎందుకంటే, సాధారణంగా రాజమౌళి తన ప్రీవియస్ సినిమాలకు మాదిరిగా షూటింగ్ కి ముందే మహేష్ మూవీ థీమ్‌ పై క్లారిటీ ఇచ్చేస్తారని టాక్ ఉండే. షూటింగ్ ఎలా జరగబోతుంది? టెక్నీషియన్స్ ఎవరున్నారు? కథ ఎలాంటి జోనర్? వంటి విషయాలు తెలిపే కాన్సెప్ట్ వీడియో ఉంటుందని వైరల్ అవుతుంది. మరి  సాయంత్రం వరకు రాజమౌళి నుండి ఏదైనా అప్డేట్ వస్తుందా..లేదా అనేది చూడాలి. 

Also Read:-క్లాస్ సినిమాకి మాస్ సెలబ్రేషన్స్..అక్షింతలు తీసుకెళ్తున్న మహేష్ ఫ్యాన్స్

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.ఇప్పటికే మహేశ్‌ లుక్‌కు సంబంధించిన స్కెచ్‌లు పూర్తవగా, వాటిల్లో ‘ది బెస్ట్‌’ను రాజమౌళి, ఆయన టీమ్‌ సెలక్ట్‌ చేసి, ఫైనల్‌ చేయనున్నట్లు సినీ సర్కిల్ లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమాకు గోల్డ్ అని మహారాజ్ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.