Subbaraman: మెగాస్టార్ కి క్షమాపణలు చెప్పిన దర్శకుడు.. కారణం ఏంటంటే?

Subbaraman: మెగాస్టార్ కి క్షమాపణలు చెప్పిన దర్శకుడు.. కారణం ఏంటంటే?

మలయాళ నటుడు విదార్థ్, వాణి భోజన్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ అంజామై. కొత్త దర్శకుడు ఎస్వీ సుబ్బరామన్ తెరకెక్కించిన ఈ సినిమాను ప్రముఖ రచయిత తిరునావుక్కరుసు నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్బంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో దర్శకుడు సుబ్బరామన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పరిస్థితుల ప్రభావం కారణంగానే ఈ సినిమాను తెరకెక్కించాను. ఈ సినిమాను నిర్మించిన తీరునావుక్కరుసు కేవలం వైద్యుడు మాత్రమే కాదు గొప్ప రచయిత కూడా. నిజానికి ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్మూటీ నటించాల్సింది. ఆయన ఒప్పుకున్నారు కూడా. కానీ, కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ సినిమాలో రఘుమాన్ నటించారు. ఈ సంధర్బంగా మమ్ముట్టికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను... అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుబ్బరామన్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక అంజామై సినిమా కథ విషయానికి వస్తే.. చట్టాలు చేసే అధికారంలో ఉన్న వ్యక్తి కారణంగా సామాన్యులు ఎలా ఇబ్బంది పడ్డారు అనేది ఈ సినిమా కథ. సినిమాలో సన్నివేశాలు కూడా చాలా సహజంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపారు. మరి జూన్ 7న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాదించనుంది అనేది చూడాలి.