హీరోలను వెతుక్కుంటున్న పవన్ దర్శకులు.. కొత్త సినిమాలు షురూ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాలపై దృష్టిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల దృష్ట్యా ఫుల్ టైం అక్కడే స్పెండ్ చేస్తున్నారు. దీంతో ఆయన చేస్తున్న సినిమాలకు బ్రేక్ పడింది. కెరీర్ లో ఎన్నడూ లేని విదంగా ఒకేసారి దాదాపు నాలుగు సినిమాలను మొదలుపెట్టేశాడు పవన్ కళ్యాణ్. వాటిలో క్రిష్ తో చేస్తున్న హరి హర వీరమల్లు, సుజీత్ తో చేస్తున్న ఓజీ, హరీష్ శంకర్ తో ఉస్తాద్ గబ్బర్ సింగ్ సినిమాలున్నాయి. ప్రస్తుతం పవన్ తీసుకున్న డెసిషన్ తో ఈ మూడు సినిమాలుక్ బ్రేక్ పడింది. 

ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మొగియడానికి కనీసం రెండు మూడు నెలలైనా పట్టే అవకాశం ఉంది. ఈ కారణంగా.. పవన్ తో సినిమాలు చేస్తున్న దర్శకులు వేరే హీరోల కోసం సెర్చింగ్ మొదలుపెట్టేశారు. ఇప్పటికే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ను పక్కనపెట్టేసి రవితేజ తో మిస్టర్ బచ్చన్ సినిమాను మొదలుపెట్టేశారు. ఇప్పుడు అదే రూట్ ను ఎంచుకోనున్నాడు దర్శకుడు సుజీత్. ఆయన కూడా ఓజీ సినిమాను పక్కన పెట్టేసి ఈ గ్యాప్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడట. నేచురల్ స్టార్ నాని కోసం ఒక కథను కూడా సిద్ధం చేశారట. పవన్ ఎలెక్షన్స్ నుండి ఫ్రీ అయ్యే సమయానికి సినిమా కంప్లీట్ చేసి సిద్ధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. 

అయితే నాని ఈ సినిమాను ఒకే చేస్తారా అనేది దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కారణం.. నాని ఇప్పటికే రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేస్తున్న సరిపోదా శనివారం, బలగం వేణు తో ఒక సినిమా ఉంది. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవడానికి కనీసం ఎనిమిది నెలలైనా పడుతుంది. కాబట్టి సుజీత్, నాని సినిమా ఉంటుందా అనేది కాస్త డౌట్ గానే ఉంది.