అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప(Pushpa) సినిమా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో ఆయనకు గ్లోబల్ స్థాయి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ సినిమాలో మరో పాత్రకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. అదే కేశవ. సినిమాలో అల్లు అర్జున్ పక్కన సపోర్టింగ్ గా ఉండే ఆ పాత్రలో నటుడు జగదీశ్ అదరగొట్టేశాడు. చిత్తూరు యాసలు మాట్లాడుతూ తనదైన శైలీలో ఆడియన్స్ ను అలరించాడు నటుడు జగదీశ్. అయితే ఈ పాత్ర కోసం ముందుగా వేరే నటుడిని అనుకున్నాడట సుకుమార్. ఈ విషయాన్ని స్వయంగా సుకుమార్ చెప్పడం విశేషం.
Also Read: సీతారాములుగా రణ్బీర్, సాయి పల్లవి.. రామాయణ సెట్స్ నుండి ఫొటోస్ లీక్
తాజాగా ఆయన ప్రసన్నవదనం సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను.. సుకుమార్ శిష్యుడు అర్జున్ తెరకెక్కించాడు. మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. నటుడు సుహాస్ గురించి ఆసక్తికర విషయలు చెప్పుకొచ్చారు. సుహాస్ నువ్వన్నా, నీ నటనన్నా నాకు, అల్లు అర్జున్ కి చాలా ఇష్టం. నువ్వు చేస్తున్న సినిమాలు, ఎదుగుదల చూస్తున్నాం. నిజానికి పుష్ప సినిమాలో కేశవ పాత్రం కోసం ముందు సుహాస్ నే అనుకున్నాం. కానీ, అప్పటికే హీరోగా చేస్తుండటంతో ఆ పాత్రకి తీసుకోవడం కరక్ట్ కాదు అనిపించింది.
నాకు నేచురల్ స్టార్ నాని అంటే కూడా చాలా ఇష్టం. సుహాస్ నాకు ఫ్యూచర్ నానీలా కనిపిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సుహాస్ గురించి సుకుమార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సుకుమార్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో పుష్ప సీక్వెల్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.