
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో సుమన్ చిక్కాల తెరకెక్కించిన చిత్రం ‘సత్యభామ’. శశికిరణ్ తిక్క సమర్పణలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. ఈనెల 7న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు సుమన్ చిక్కాల మాట్లాడుతూ ‘శశికిరణ్ తిక్క నాకు మంచి ఫ్రెండ్. తన వల్లే దర్శకుడిగా మారాను. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథను రెడీ చేశాం. తాము టేకప్ చేసిన కేసుల విషయంలో ఒక్కోసారి పోలీస్ ఆఫీసర్స్ ఎమోషనల్‌గా పనిచేస్తారు. అలా ఓ కేసు విషయంలో ఎమోషనల్ అయిన సత్యభామ బాధితురాలికి ఎలా న్యాయం చేసింది అనేది కథ.
తన పాత్రకు ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతారు. లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నట్టుగా ఈ కథ రాయలేదు. కథలో అమ్మాయి విక్టిమ్ కనుక ఫీమేల్ అయితే బాగుంటుంది అనిపించింది. . ఎమోషన్ పండించడంలో కాజల్‌కు మంచి పేరుంది. ఆమె యాక్షన్ చేస్తే కొత్తగా ఉంటుంది. రెండింటికీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని నమ్మాం. యాక్షన్ సీన్స్ కోసం కాజల్ ఎంతో కష్టపడ్డారు. డూప్ లేకుండా ధైర్యంగా యాక్షన్ సీన్స్‌లో నటించారు. కాజల్‌గా సెట్స్‌లోకి వచ్చిన ఆమె ‘సత్యభామ’గా ఇంటికెళ్లారు. ఆమెకు పెయిర్‌గా కీలకపాత్రను నవీన్ చంద్ర పోషించారు. సినిమాలో ప్రత్యేకంగా మెసేజ్ ఇవ్వలేదు. కానీ కథలో భాగంగా కొంత మెసేజ్ ఉంటుంది’ అని చెప్పాడు.