30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు(Chaitanya Rao), రాగ్ మయూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమా కీడా కోలా(Keeda-Cola). ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంతో పాటు..కీలకమైన పాత్రను పోషించాడు. ఇటీవలే రిలీజైన ట్రైలర్ తో ఆసక్తి పెంచేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఫుల్ మీల్స్ ఎంటర్‌టైనర్‌లా ఉంది. క్రైమ్ కామెడీ జోనర్లో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం(Bramhanandam) ముఖ్యమైన పాత్రను పోషించారు.
లేటెస్ట్ గా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీడా కోలా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ మూవీలో బ్రహ్మనందం పాత్ర కోసం..స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్(Allu Arvind) ని సంప్రదించినట్లు తెలిపారు. అపుడు ఆయన క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉందంటూనే..నటించడానికి నో చెప్పాడు. దీంతో బ్రహ్మీని అప్రోచ్ అయినట్లు తరుణ్ భాస్కర్ వెల్లడించారు.
ఈ క్రేజీ న్యూస్ తెలుసుకున్న ఆడియాన్స్..అల్లు అరవింద్ నో చెప్పకుండా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇది వరకే అల్లు అరవింద్ కామెడీ టైమింగ్ చాలా సార్లు స్టేజ్ పై చూశారు. ఆయన తనడైన కామిక్ మాటలతో నవ్విస్తుంటారు.
అంతేకాకుండా చాలా ఏళ్ల క్రితమే చిరంజీవి చంటబ్బాయి మూవీలో ఆయన చేసిన పాత్ర ఎంతోగాను ఆకట్టుకుంది. కీడా కోలా మూవీలో నటించి ఉంటే ఆడియన్స్ కి కిక్ ఇచ్చి ఉండేవారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయితే తెలిసిపోద్ది..మరి ఎటువంటి క్యారెక్టర్ ను వదులుకున్నాడనేది.
కీడా కోలా మూవీని కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం (Vivek Sagar) అందిస్తున్నాడు. హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.ఈ మూవీ 2023 నవంబర్ 3న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.