‘చిత్రం’ సీక్వెల్ అనౌన్స్ చేసిన తేజ

టాలీవుడ్‌‌‌‌లో డిఫరెంట్‌‌‌‌ సబ్జెక్ట్స్‌‌‌‌ని డీల్ చేసే దర్శకుల్లో తేజ ఒకరు. రైటింగ్ నుంచి మేకింగ్ వరకు ఆయనది ఓ ప్రత్యేక శైలి. సినిమా సినిమాకీ జానర్ మార్చుకుంటూ వెళ్తుంటారాయన. అయితే తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో మొట్టమొదటిసారి ఓ సినిమాకి సీక్వెల్‌‌‌‌ని అనౌన్స్‌‌‌‌ చేసి సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేశారు. అది కూడా తన ఫస్ట్ సినిమాకి. ‘చిత్రం’ సినిమాతో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా తేజ జర్నీ మొదలైంది. ఆ సినిమాతో ఉదయ్‌‌‌‌ కిరణ్‌‌‌‌ని, రీమాసేన్‌‌‌‌ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారాయన. ఇరవయ్యేళ్ల తర్వాత ఇప్పుడా మూవీకి సీక్వెల్ తీయబోతున్నానంటూ ప్రకటించారు తేజ. ‘చిత్రం 1.1’ టైటిల్‌‌‌‌తో రూపొందే ఈ మూవీకి ఫస్ట్‌‌‌‌ పార్ట్‌‌‌‌కి మ్యూజిక్‌‌‌‌ ఇచ్చిన ఆర్పీ పట్నాయక్‌‌‌‌నే మళ్లీ సెలెక్ట్ చేసుకున్నారు. సమీర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సినిమాటోగ్రాఫర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌‌‌‌‌‌‌‌. తన ‘చిత్రం మూవీస్‌‌‌‌’ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై తేజ నిర్మిస్తారు. ఇప్పటికే ఎంతోమంది ఆర్టిస్టుల్ని టాలీవుడ్‌‌‌‌కి పరిచయం చేసిన ఆయన.. ఈ మూవీతో నలభై అయిదు మంది కొత్తవారిని పరిచయం చేయబోతున్నారు. మార్చి నుండి షూటింగ్ మొదలు కానుంది. ఆల్రెడీ రానాతో ఒక మూవీ, గోపీచంద్ హీరోగా ‘అలివేలు మంగ వెంకటరమణ’ ప్రకటించారు. అవి సెట్స్‌‌‌‌కి వెళ్లకముందే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

కబడ్డీ.. గ్రౌండ్‌‌‌‌లో ఆట..బయట ఆడితే వేట

అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్    

అప్పుడు పబ్‌‌.. ఇప్పుడు వైల్డ్‌‌లైఫ్‌‌ హాస్పిటల్‌