![సినిమాలు తీయని నువ్వెలా ప్రశ్నిస్తావ్.. తేజ స్ట్రాంగ్ వార్నింగ్](https://static.v6velugu.com/uploads/2023/05/Director-Teja-solid-counter-to-reporter-Suresh-Kondeti_P6tBQEsmp2.jpg)
సురేష్ కొండేటి.. సోషల్ మీడియాలో ఈ మధ్య భాగా వినిపిస్తున్న పేరు. రిపోర్టర్ గా సినిమా ప్రెస్ మీట్స్ లో యూనిట్ ను ఇబ్బంది కరమైన ప్రశ్నలు అడిగి సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం ఈయన స్పెషాలిటీ. DJ టిల్లు సిద్దు జన్నలగడ్డ దగ్గర నుండి.. మొన్నటి టక్కర్ సిద్దార్థ్ వరకు కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు. దానికి హీరోస్ నుండి కూడా అదిరిపోయే కౌంటర్స్ వచ్చాయి. అయినా కూడా సురేష్ కొండేటి తన పద్దతి మార్చుకోలేదు.
రీసెంట్ గా డైరెక్టర్ తేజ తెరకెక్కించిన అహింస మూవీ ప్రెస్ మీట్ లో కూడా ఇలాంటి ప్రశ్నలే అడిగాడు. వాటికి తేజతో పాటు చిత్ర యూనిట్ కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు. అయితే ప్రెస్ మీట్ అయ్యాక తేజ సురేష్ కొండేటిని కలిసి ఒక క్వశ్చన్ అడిగాడు. ప్రెస్ మీట్స్ లో మమ్మల్ని ఇబ్బంది పెట్టె ప్రశ్నలు అడుగుతావ్ కదా అసలు నువ్వు ఎందుకు సినిమాలు తీయడం మానేసావ్ అని అడిగాడు. దానికి సమాధానంగా సురేష్ కొండేటి.. కోరోనా తరువాత పరిస్థితి పూర్తిగా మారింది. జనాలు సినిమాలు చూడటం మానేసారు. అందుకే భయమేసి మానేసాను అని చెప్పుకొచ్చాడు.
మరి సినిమాలు తీయడానికి భయపడే నువ్వు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావ్ అంటూ సీరియస్ అయ్యాడు తేజ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సురేష్ కొండేటి నిర్మాత సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. కానీ గత కొంత కాలంగా సినిమా తీయడం మానేసాడు సురేష్ కొండేటి.