సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేసే నవ్వులతో.. మజాకా

సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేసే నవ్వులతో.. మజాకా

సందీప్ కిషన్ హీరోగా త్రినాధరావు నక్కిన రూపొందించిన చిత్రం ‘మజాకా’. ఎకే ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌‌‌‌పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్  చెప్పిన విశేషాలు. 

‘‘నా గత నాలుగు సినిమాలు సీరియస్ టోన్‌‌‌‌లో  ఉంటాయి.  ఫ్యామిలీ అంతా హాయిగా ఎంజాయ్ చేయాలనే  ఉద్దేశంతో క్లీన్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా రూపొందించిన  సినిమా ఇది.  ఇప్పటివరకు రాని కాన్సెప్ట్‌‌‌‌తో  ఆడియెన్స్‌‌‌‌ని సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేసేలా ఉంటుంది. ఫాదర్ అండ్ సన్ కామెడీ, ఎమోషన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. ఇందులో నా క్యారెక్టర్ పేరు కృష్ణ. నా ఫాదర్ పాత్రలో రావు రమేష్​ నటించారు.  బ్యాచిలర్స్‌‌‌‌గా బ్రతుకుతున్న మమ్మల్ని  ఎవరూ పండగలకి, ఫంక్షన్స్‌‌‌‌కు పిలవరు. మా కెమిస్ట్రీ చాలా నేచురల్‌‌‌‌గా  వర్కవుట్ అయ్యింది.  కలిసి తాగి పడిపోయే తండ్రీ కొడుకులుగా కనిపిస్తాం.

నా పాత్ర చాలా ఎనర్జిటిక్‌‌‌‌గా ఉంటుంది.  రీతూ వర్మ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ సినిమాకి  ఫ్రెష్‌‌‌‌నెస్‌‌‌‌ను యాడ్ చేస్తుంది. అన్షు (‘మన్మథుడు’ ఫేమ్‌‌‌‌) లాంటి అమ్మాయిని రావు రమేష్  గారు ప్రేమలోకి దింపడం ఫన్ రైడ్‌‌‌‌లా ఉంటుంది. సీన్‌‌‌‌ని ఎలా తీస్తే పండుతుందో త్రినాధరావుకు బాగా తెలుసు. నిర్మాతలు రాజేష్, అనిల్ గారు  ఒకరు అన్నయ్య, మరొకరు ఫ్రెండ్‌‌‌‌లా ఉంటారు కనుక నాకిది హోం ప్రొడక్షన్ లాంటిది.  నా పదిహేనేళ్ల జర్నీలో ముప్ఫై సినిమాలు చేశా ఇది వెరీ ఇంటరెస్టింగ్‌‌‌‌ అడ్వెంచరస్ జర్నీ.

నేను ప్రేమించిన వృత్తికి పూర్తి అంకితభావంతో ఉంటూ నా కుటుంబం కంటే సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నా. నాకు రాబిన్ హుడ్‌‌‌‌ లాంటి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు  ‘రాంజాన’  లాంటి లవ్ స్టోరీ చేయాలని ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ గారి అబ్బాయి సంజయ్‌‌‌‌ డైరెక్షన్‌లో ఓ  సినిమా చేస్తున్నా. న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా ఇది తెరకెక్కుతోంది. అలాగే  నెట్ ఫ్లిక్స్‌‌‌‌లో ఓ  వెబ్ సిరీస్,  ఫ్యామిలీ మ్యాన్ 3 చేస్తున్నా’’.