హీరోయిన్ కి క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ త్రినాథ్ రావు..

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన సినిమా ఈవెంట్ లో వెటరన్ హీరోయిన్ అన్షు అంబానీ పై చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సిగా మారాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా మహిళలకి క్షమాపణలు తెలియజేశాడు. ఇందులోభాగంగా ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో " మహిళలకి, అన్షు గారికి, మరియు నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు .. అయినప్పటికీ తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను" అంటూ త్రినాధ రావు నక్కిన క్షమాపణలు తెలిపాడు.

టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ అన్షు అంబానీ దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన తెరకెక్కించిన "మజాకా" అనే సినిమాతో 23 ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తోంది. అన్షు అంబానీ సన్నగా ఉండటంతో దర్శకుడు త్రినాథ్ రావు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కొచెం బరువు పెరగాలని అలా అయితేనే తెలుగు ఆడియన్స్ చూస్తారని వాఖ్యలు చేశాడు. దీంతో ఈ విషయం కాంట్రవర్సీ అయ్యింది. అంతేకాదు తెలంగాణ మహిళా కమీషన్ సైతం డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కినపై సీరియస్ అయ్యింది. 

Also Read : రాజాసాబ్ నుంచి న్యూ పోస్టర్
 

ఈ విషయం ఇలా ఉండగా త్రినాథ్ రావు నక్కిన ఆమధ్య రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో హిట్ అందుకున్నాడు. దీంతో మజాకా సినిమాతో హిట్ ట్రాక్ కంటిన్యూ చెయ్యాలని చూస్తున్నాడు. మజాకా సినిమాలో హీరోగా ప్రముఖ తెలుగు హీరో సందీప్ కిషన్ నటిస్తుండగా రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. రావు రమేష్, అన్షు అంబానీ, మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఇటీవలే సినిమా టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మజాకా సినిమా ఫిబ్రవరి 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.