తప్పు జరిగిపోయింది.. పెద్ద మనసు చేసుకుని క్షమించండి.. వీడియో వదిలిన డైరెక్టర్ త్రినాధ రావు

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘మజాకా’ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు డైరెక్టర్‌ త్రినాథ్‌ రావు నక్కిన స్పందించారు. తాజాగా ఈ అంశం మీద డైరెక్టర్ త్రినాథరావు క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.ఆయన మాటల్లోనే.. 

 "నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళల మనసులు నొప్పించిందని విషయం అర్థమైంది. అయితే ఇది అందరికీ చెబుతున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లోంచి వచ్చిన మాటలే తప్ప.. నేను కావాలని చెప్పింది కాదు. అయినా సరే మీ అందరి మనసులు నొప్పించాను కాబట్టి తప్పు తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. 

పెద్ద మనసు చేసుకొని క్షమించండి మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నేను హీరోయిన్ అన్షు గారికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అలాగే నేను కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించడం కోసం వాడిన మేనరిజంని విషయంలో కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా కావాలని చేసింది కాదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్విద్దామని అనుకున్నాను. కానీ ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోలేదు.

ALSO READ | Vishal Health Update: నాకెలాంటి స‌మ‌స్య లేదు. .మైక్ కూడా ప‌ట్టుకోగలుగుతున్నా.. ఆరోగ్యంపై విశాల్ క్లారిటీ

దయచేసి ఆ ఇష్యూ కి సంబంధించిన వారి అభిమానుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు దయచేసి నన్ను పెద్దమనిషి చేసుకుని క్షమించండి అని ఆయన అన్నారు.

అసలేం జరిగిందంటే:

మన్మధుడు హీరోయిన్ అన్షు అంబానీ మళ్ళీ 23 ఏళ్ళకి తెలుగులో నటిస్తుండటం విశేషం. అయితే, డైరెక్టర్ త్రినాధరావు మాట్లాడుతూ.. ‘‘మేము ఎప్పుడో చిన్న పిల్లలుగా ఉన్నపుడు.. మన్మధుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో బొద్దుగా ఆకట్టున్న అలాంటి అమ్మాయి ఒక్కసారిగా కళ్ల ముందు కనిపిస్తే ఇంకేమైనా ఉందా. ఇప్పటికీ అలాగే ఉందా.. కొంచె సన్నబడింది.. నేనే చెప్పా.. కొంచెం తిని పెంచమ్మా.. తెలుగుకు అన్నీ కొంచె ఎక్కువ సైజులోనే ఉండాలని చెప్పా.. పర్లేదు కొంచె ఇంప్రూవ్ అయినట్లుంది.’’ అని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద సీరియస్ అయ్యారు. దర్శకుడు తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఛైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద ఈ నోటీసులు జారీ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది.ఈ నేపథ్యంలో త్రినాథరావు వీడియో రిలీజ్ చేస్తూ క్షమాపణలు తెలిపారు. మరి ఈ ఇష్యు ఎంతవరకు వెళుతుందో చూడాలి.