హీరోయిన్ నాకు హగ్ ఇవ్వలేదు.. దర్శకుడు త్రినాథరావ్ ఆసక్తికర కామెంట్స్

త్రినాథ రావు నక్కిన(Trinadharao Nakkina).. దర్శకుడిగా టాలీవుడ్ తనదైన ముద్రను వేసుకున్నాడు. తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు. హీరో నానితో చేసిన నేను లోకల్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన నిర్మాతగా నక్కిన నరేటివ్స్ అనే కొత్త బ్యానర్ ను స్థాపించాడు. ఈ బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమాగా చౌర్య పాఠం(Chaurya Patam). నిఖిల్ గొల్లమరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, మస్త్ అలీ, మాడి మానేపల్లి, అంజి వల్గుమాన్ కీ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ ఈవంటి లో భాగంగా హీరోయిన్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. కానీ, వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయ్యారు. చాలా ఏళ్ళ నుండి అక్కడే ఉంటున్నా తెలుగు బాగా మాట్లాడుతున్నారు. నేను చాలాసార్లు అబ్సర్వ్ చేశాను ఈ అమ్మాయి మూవీ సెట్ లో అందరికి హాగ్ ఇస్తుంది కానీ, నాకు మాత్రం ఒక్కసారి కూడా హగ్ ఇవ్వదు. నేను చాలాసార్లు అడిగాను కూడా. పేమెంట్ మాత్రం మొత్తం తీసేసుకుంది కానీ, హగ్ మాత్రం ఇవ్వలేదు. ఇప్పటికైనా హగ్ ఇస్తావా పాయల్.. అంటూ స్టేజి పైనే హీరోయిన్ ని హాగ్ అడిగారు త్రినాధరావు. 

ALSO READ :- IND vs AUS U19 WC: మరి కొన్ని గంటల్లో ఫైనల్ మ్యాచ్..లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

ఇక త్రినాథరావు మాటలకి నవ్వుకున్నా హీరోయిన్ పాయల్.. త్రినాథ రావుకి సైడ్ హాగ్ ఇచ్చింది. ఆ హాగ్ కి వెంటనే స్పందించిన త్రినాథరావు.. దీన్ని హాగ్ అంటారా. హాగ్ అంటే ఎలా ఉండాలి. కొడితే గూబ పగిలిపోవాలి.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దర్శకుడు త్రినాధరావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.