కాలినడకన తిరుమలకు చేరుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్..

కాలినడకన తిరుమలకు చేరుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్..

మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు.శ్రీవారి మెట్టు కాలిబాట ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.ఈ రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు త్రివిక్రమ్. రేపు ఉదయం విఐపీ బ్రేక్  సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి., డిప్యూటీ సీఎం అయ్యాక మొదటి సారి త్రివిక్రమ్ తిరుమలకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. 

పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో త్రివిక్రమ్ తిరుమల సందర్శించారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయిన పవన్ 2024ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అంతే కాకుండా, కూటమి మధ్య పొత్తు కుదర్చటంలో కీలక పాత్ర పోషించి వైసీపీ ఓడించటంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు సీఎం చంద్రబాబు.