మక్తల్, వెలుగు: గుంటూరు కారం సినిమాలో విలన్లకు ప్రపంచ మేధావులైన కారల్ మార్క్స్, లెనిన్ ల పేర్లు పెట్టడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో డైరెక్టర్ త్రివిక్రమ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తెలపాలన్నారు. వెంటనే ఆ పేర్లను తొలగించాలని త్రివిక్రమ్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కిరణ్, సిద్దు, ఈశ్వర్, శారద, అజయ్, మహాదేవి, సావిత్రమ్మ, ఆనంద్, అజయ్, కల్యాణం రాజు పాల్గొన్నారు.