మాస్ మహరాజ్ రవితేజ(Raviteja) హీరోగా డైరెక్టర్ వంశీ(Vamsee) తెరకెక్కిన మూవీ టైగర్ నాగేశ్వర రావు(Tigernageswararao). ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ నెల అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. రిలీజ్ కు ఇంకా..2 రోజులే టైం ఉండటంతో..మేకర్స్ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ వాస్తవ కథలో చాలా సవాళ్లే ఉండంతో.. హీరో రవితేజ తన ఆహార్యంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. కరుడు గట్టిన దొంగలా బాడీ ట్రాన్సపర్మేషన్..ట్రైలర్ లో గంబీరమైన పెర్పార్మెన్స్ అదిరిపోయింది. దీంతో ఈ మూవీలో రవితేజ నుంచి డైలాగ్స్..కాలర్ ఎగరేసే నటనను ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ఇప్పటికే ఈ మూవీలోని కొన్నిరకాల ఛేజింగ్ ల గురించి చిత్ర యూనిట్ రివీల్ చేసింది. లేటెస్ట్ గా డైరెక్టర్ వంశీ..మరో ఇంట్రెస్టింగ్ ఛేజింగ్ ని షేర్ చేసుకున్నారు. ఈ సినిమా యాక్షన్ లో..మేకింగ్ పరంగా మీకు సవాల్ విసిరిన సీన్ ఏంటని అడగగా..రాజమండ్రి బ్రిడ్జిసీన్ అని డైరెక్టర్ అన్నారు.
డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ..రాజమండ్రి బ్రిడ్జ్ పై ట్రైన్ సీన్ ను..రీక్రియేట్ చేయడం కోసం.. మేము చాలా కష్టపడాల్సి వచ్చింది.నాతో పాటు డీఓపీ..ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్..ఆర్ట్ డిపార్ట్ మెంట్..ఇలా ప్రతి ఒక్కరూ..నా మైండ్ లో మెదిలే విజన్ కి తగ్గట్టు అద్బుతంగా వచ్చేంత వరకు శ్రమించారు. ఆ సీన్ ఎలా ఉండాలనుకున్నానో.. అలానే నాకు ఔట్ ఫుట్ ఇచ్చారని తెలిపారు.
ALSO READ : నాకు నమ్మకం ఉంది.. రెండేళ్ల తరువాత రెండో పెళ్లి: రేణు దేశాయ్
ఇందులో 20 సీక్వెన్స్ తీయడానికి 20 రోజుల వరకు టైం పట్టిందని..అందుకు తగ్గ గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ చేయడానికి..ఏడాది కాలం పైగా టైం తీసుకున్నట్లు పేర్కోన్నారు. ఆ సీన్ కోసం అంతగా పనిచేయాల్సి వచ్చిందంటే..ఇంకా ట్రైన్ ఎపిసోడ్ ఎలా ఉంటుందనేది ఇమాజిన్ చేసుకోవొచ్చు.
ఈ ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని డైరెక్టర్ చెప్పగా..మాస్ రాజా ఆడియన్స్ లో హైప్ పెంచేశారు. అంతేకాకుండా.. రాజమండ్రి బ్రిడ్జిపై రన్నింగ్ ట్రైన్ ఎలా ఉంటుందనేది..ఈ మూవీలో వచ్చే సన్నివేశంలో కళ్ళకు కట్టినట్లుగా చూడొచ్చనే విషయం అర్ధం అవుతుంది.
ఈ సినిమాలో బాలీవడ్ బ్యూటీ నుపుర్ సనన్ (Nupur Saonon) హీరోయిన్ గా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మురళీశర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్(gvprakash) సంగీతం అందిస్తున్నారు.