రామ్ చరణ్ కోసమే చిరంజీవి త్యాగం చేశారు: మల్లిడి వశిష్ట

రామ్ చరణ్ కోసమే చిరంజీవి త్యాగం చేశారు: మల్లిడి వశిష్ట

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మల్లిడి వశిష్ట మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే దసరా పండగ సందర్భంగా  విశ్వంభర చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వశిష్ట పలువురు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. 

ఇందులో భాగంగా ఓ నెటిజన్ సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదల కావాల్సిన విశ్వంభర చిత్రం రిలీజ్ డేట్ ని ఎందుకు చేంజ్ చేశారని అడిగారు. దీంతో వశిష్ట రిలీజ్ డేట్ మార్పు గురించి మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం కోసమే విశ్వంభర చిత్రం రిలీజ్ డేట్ ని మార్చారని తెలిపాడు. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల చిత్రాల రిలీజ్ డేట్ల మధ్య క్లాష్ రాకుండా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. 

మరో రిపోర్టర్ ఏకంగా "రామ్ చరణ్ చిరంజీవి కొడుకు కావడంవల్లే రిలీజ్ డేట్ మార్చారా.? అదే వేరే హీరో అయితే రిలీజ్ డేట్ మార్చేవారా అని అడిగారు. దీంతో దీంతో వశిష్ట ఏ హీరో సినిమా అయినా రిలీజ్ డేట్ విషయంలో తుది నిర్ణయం చిరంజీవిదే అంటూ సమధానం ఇచ్చాడు.