
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా, బింబిసార(Bimbisara) దర్శకుడు వశిష్ట(Vassishta) కాంబోలో విశ్వంభర మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్(UV Creations) సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కొన్ని టాకీ పార్ట్‌లు, ఒక పాట, ఒక యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించారు మేకర్స్.
లేటెస్ట్గా డైరెక్టర్ వశిష్ట ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.హనుమంతుని విగ్రహం ముందు కత్తులు గాల్లోకి ఎగురుతున్నట్టుగా ఉన్న ఒక ఫోటోని ఆయన షేర్ చేస్తూ "ధర్మ యుద్ధం మొదలు!!! ఇది విశ్వంభర విజృంభణం"అంటూ ఆయన రాసుకొచ్చారు.దీంతో మెగా ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ కన్ఫమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పోచంపల్లిలో జరుగుతున్నట్టు సమాచారం.అక్కడ వేసిన స్పెషల్ సెట్ లో షూట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ధర్మ యుద్ధం మొదలు!!! విశ్వంభర విజృంభణం 🔥🔥🔥 pic.twitter.com/7g1CcajjLU
— Vassishta (@DirVassishta) April 8, 2024
ఇటీవలే ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవి, కొంతమంది ఫైటర్స్‌పై హై-ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఈ సీక్వెన్స్ కీలకమైన దశలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌ను ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.అలాగే ఈ షెడ్యూల్‌లో చిరంజీవి,త్రిషతో పాటు ఇతర నటీనటులపై కూడా ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇందులో చిరంజీవి డ్యూయెల్ రోల్ చేస్తున్నారని,అందులో ఒకటి యంగ్ లుక్ కాగా,వయసు పైబడిన మరో పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సురభి,వెన్నెల కిషోర్, హర్షవర్ధన్,ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది.ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.