The GOAT : ‘ది గోట్‌' నెగిటివ్ రివ్యూలపై..స్పందించిన డైరెక్టర్ వెంకట్‌ ప్రభు

The GOAT : ‘ది గోట్‌' నెగిటివ్ రివ్యూలపై..స్పందించిన డైరెక్టర్ వెంకట్‌ ప్రభు

స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) లేటెస్ట్ మూవీ ది గోట్ (THE GOAT). ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రాగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎక్కడ చూసిన విజయ్ ఫ్యాన్స్ హంగామా నడుస్తోంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ కొన్ని చోట్ల మిశ్రమ స్పందనలు,నెగిటివ్ రివ్యూలు సైతం అందుకుంది. 

అయితే గోట్ మూవీ మంచి వసూళ్లు సాధిస్తుంటే.. సోషల్ మీడియాలో అనేక మంది ఇప్పటికీ నెగిటివ్ రివ్యూలు వస్తుండటంతో డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించారు. సినిమాను తెరకెక్కించింది ప్రేక్షకుల కోసమేనని తెలిపారు. విమర్శకుల కోసం కాదని క్లారిటీ ఇచ్చారు. మూవీ తీసేందుకు తాము పడ్డ కష్టాన్ని ఎవరూ గుర్తించరని అన్నారు. కొందరు సినిమాపై కావాలనే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని తెలిపారు.

Also Read:-రిలీజ్ డేట్ అనౌన్స్

చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి సంబందించిన సీన్స్ హైలైట్‌ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు మరియు హిందీ బెల్ట్‌లో ది గోట్‌ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. వెంకట్‌ ప్రభు కామెంట్స్‌ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.

అయినా మిశ్రమ స్పందనలు,నెగిటివ్ రివ్యూలు వస్తున్న..ది గోట్‌ కలెక్షన్స్ తగ్గేదేలే అనేలా జోరు కొనసాగిస్తోంది. ది గోట్ మూవీ..నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 280 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సెకండ్ వీక్ లో మరిన్ని కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. 

  • Beta
Beta feature