తెలుగు ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన లక్కీ భాస్కర్ చిత్రం మంచి హిట్ అయ్యింది. కాగా ఈ సినిమా అక్టోబర్ 31న దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ రూ.39 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఇటీవలే చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సస్ మీట్ నిర్వహించారు.
ఇందులో భాగంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ లక్కీ భాస్కర్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియన్స్ కి ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ డైరెక్టర్లు హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ సినిమాలకి గతంలో ఆడిషన్స్ ఇచ్చానని కానీ సెలెక్ట్ కాలేదని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ లో వీరిద్దరితో కలసి స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
Also Read :- స్టార్ హీరోల సినిమాల్లో రెమ్యునరేషన్ అలా ఉంటుంది
అయితే గతంలో డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రముఖ డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి డైరెక్ట్ చేసిన స్నేహగీతం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఈ సినిమాలోని సరిగమపదనీ.. సప్త లయలు వినిపిస్తున్న అనే పాట ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. స్నేహగీతం సినిమాలో నటించిన తర్వాత వెంకీ అట్లూరి హీరోగా అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ వర్కవుట్ కాలేదు. కానీ డైరెక్టర్ గా మాత్రం బాగానే క్లిక్ అయ్యాడని చెప్పవచ్చు.