
దర్శకుడు బలగం వేణు (Balagam Venu)తన రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఎల్లమ్మ (Yellamma)అనే గ్రామీణ టైటిల్తో వస్తోన్న వేణు.. సినిమా కథపై పట్టుదలతో ఉన్నాడు.
ఈ క్రమంలో ఎల్లమ్మలో నటించే రంగస్థల కళాకారుల కోసం గాలింపు దిశగా సాగుతున్నారు. ఇందులో భాగంగా మారుమూల పల్లెల్లో, నగరాల్లో వేణు వేట మొదలుపెట్టినట్టుగా సమాచారం.
ఇందులో భాగంగా సిరిసిల్ల, నిజామాబాద్‌లలోనూ వేణు పర్యటించాడట. అక్కడ కొంతమంది రంగస్థల కళాకారుల ప్రతిభని చూసి ఆశ్చర్యపోయాడట. వారిని ఎంపిక చేసి, ప్రత్యేకంగా స్టేజ్ డ్రామాలు, వారి నటనను పరిశీలించాకే సినిమాలో తీసుకోనున్నాడట వేణు.
Also Read:-దర్శకుడు బుచ్చిబాబుకు రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేక బహుమతి..
బలగం సినిమాలో సైతం ఎంతోమంది కళాకారులని తీసుకొచ్చి వారికీ లైఫ్ ఇచ్చాడు వేణు. వారి నుంచి మంచి నటనను రాబట్టుకుని.. సినిమా చూసిన ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టేలా చేశాడు. అంతలా ప్రేక్షకులను కట్టిపడేశారు బలగం రంగస్థల కళాకారులు.
ఇదే బలాన్ని ఎల్లమ్మ సినిమా కోసం తీసుకొచ్చే దిశగా వేణు ప్రయత్నం చేస్తున్నాడు. మరి బలగంతో వేణు చేసిన మ్యాజిక్.. ఎల్లమ్మకు ఎంతవరకు ప్లస్ అవ్వనుందో చూడాలి.
ఎల్లమ్మ (Yellamma):
తెలంగాణ మనుషులలో బాగా పాపులర్ అయిన పేరునే టైటిల్గా ఎంచుకున్నారు వేణు. కథని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ వేణు 'ఎల్లమ్మ 'అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఇందులో హీరోగా నితిన్ కనిపిస్తున్నాడు. నితిన్కి జోడిగా కీర్తి సురేష్ నటించనున్నట్లు సమాచారం. ఆ మధ్య సహజ నటి సాయి పల్లవిని ఎంచుకున్నట్లు టాక్ ఉండే. ఇపుడు లేటెస్ట్గా కీర్తి సురేష్ అని అంటున్నారు. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. అయితే, ఈ కథకి ముందుగా హీరో నాని నటిస్తున్నట్లు ముందునుంచి టాక్ వినిపించింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నితిన్ దగ్గరకి వెళ్ళింది.
ఈ సినిమాకు సంబంధించి వేణు విజన్కి.. నిర్మాత దిల్ రాజు పెద్ద పీట వేస్తూ..తనకి పూర్తిగా స్వేచ్ఛని కల్పించినట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ అనే పేరుతో.. తెలుగు నేటివిటీని కళ్ళకు కట్టినట్లు చూపించాలని వేణు ఫిక్స్ అయ్యాడట.
తెలంగాణలో మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎల్లమ్మ గ్రామ దేవతగా పిలుస్తుంటారు. అలాంటిది వేణు తన రెండో సినిమాకి 'ఎల్లమ్మ' టైటిల్‌గా పెట్టడం మరింత ఆసక్తికరంగా మారింది.