మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా..డైరెక్టర్ విద్యాధర్ (Vidyadhar) కాగిత తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami). వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఘోరా పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు విశ్వక్ సేన్.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పరిస్థితిలో హీరో చేసే ప్రయత్నాలు..దేవదాసి నుంచి ఒక మహిళను సాదారణ గృహిణిగా మార్చడం..ఆమె ఊరి నుంచి పారిపోవడం..ఆమెను తీసుకురాకపోతే గ్రామంకు అనర్థమని చెప్పడం..మరోపక్క ఎవరు లేని ఒక ప్రదేశంలో కొంతమందిని ఖైదీలుగా ఉండటం ట్రైలర్లో హైలెట్గా చూపించారు డైరెక్టర్ విద్యాధర్.
అయితే..ట్రైలర్ కట్ సీన్స్లో..సినిమా ఎలా ఉండబోతుందో..సినీ ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి గామి అనగా అర్ధమేంటనే ఆలోచనలో పడ్డారు.లేటెస్ట్గా ట్రైలర్ ఈవెంట్లోడైరెక్టర్ విద్యాధర్ కాగిత క్లారిటీ ఇచ్చాడు.
ALSO READ :- గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం.. భారీగా వ్యాపించిన పొగలు
డైరెక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ..'గామి చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమా అయ్యింది. గామి అంటే సీకర్..తాను అనుకున్న గమ్యాన్ని గమించేవాడు గామి. మీనింగ్ ఉంది దానికి. అతనికి మానవ స్పర్శే అతి పెద్ద భయం.. మానవ స్పర్శనే అతని కోరిక కూడా. ఇంతకన్నా ఎక్కువ చెప్పే సందర్బం కాదు. గామి సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించాం. మంచి సినిమాను మీ కళ్ళ ముందుకు తీసుకురావడం కోసమే ఇన్నేళ్ళు కష్టపడ్డాం.అందుకు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. మార్చి 8న సరికొత్త తెలుగు సినిమాని చూస్తారని కోరుకుంటునన్నాను' అంటూ డైరెక్టర్ విద్యాధర్ అన్నారు.
దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కోసం విశ్వక్ చాలా కష్టపడ్డాడు. కేవలం సినిమాలోని కంటెంట్ ఉన్న నమ్మకమే దానికి కారణం.మరి సరికొత్త కథా, కథనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.