ఆస్తులన్నీ అమ్ముకున్నా.. అప్పులు తెచ్చి మరీ ఈ సినిమా తీశా: దర్శక నిర్మాత విఘ్నేశ్

ఆస్తులన్నీ అమ్ముకున్నా.. అప్పులు తెచ్చి మరీ ఈ సినిమా తీశా: దర్శక నిర్మాత విఘ్నేశ్

సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా సాయి కుమార్ ముఖ్య పాత్ర పోషించిన చిత్రం ‘ప్రణయ గోదారి'.పిఎల్ విఘ్నేష్ దర్శక నిర్మాతగా రూపొందించిన ఈ సినిమా డిసెంబర్ 13న  విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్‌‌కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహైల్ అతిథులుగా హాజరై మూవీ టీమ్‌‌కు బెస్ట్‌‌ విషెస్ చెప్పారు. దర్శక నిర్మాత విఘ్నేశ్ మాట్లాడుతూ ‘మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేను ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆస్తులన్నీ అమ్ముకున్నాను. అప్పులు తెచ్చి మరీ సినిమాను తీశాను.

నా అన్న మార్కండేయ కోసం ఈ మూవీ చేశా. మా అన్న ఈ చిత్రానికి మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. అందరి సహకారంతో డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం.. అందరూ వచ్చి చూసి సక్సెస్ చేయండని కోరారు". హీరోయిన్ ప్రియాంక ప్రసాద్, నటి ఉషా శ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.