![యాదగిరిగుట్టకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.. 19 నుంచి 23 వరకు మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు](https://static.v6velugu.com/uploads/2025/02/director-vijayendra-prasad-visits-yadagirigutta-and-eo-says-about-mahakumbha-samprokshana-event_6BG1QKxw8R.jpg)
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శకుడు రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత కొండచుట్టు తిరిగి గిరి ప్రదక్షిణ మార్గం ఏర్పాట్ల, అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈఓ భాస్కర్ రావును కలిసి ఆలయ ప్రాశస్త్యం, అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆలయ గోపురం స్వర్ణతాపడం పనులు, మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలపై ఈవో కామెంట్స్:
- ఈ నెల 14లోగా బంగారు తాపడం పనులు పూర్తి అవుతాయి
- 19నుంచి 23 వరకు మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు
- విమాన గోపురం మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలకు వానమామలై పీఠాధిపతి మధుర వానమామలై రామానుజ జీయర్ స్వామి ప్రత్యేక పర్యవేక్షణలో చేపట్టనున్నాం.
- 23న ఉదయం 11:54 గంటలకు మహా సంప్రోక్షణ క్రతువు నిర్వహించి దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నాం.
- పంచతల దివ్య విమానగోపురం 10,759 ఎస్ఎఫ్టీ చుట్టు కొలతతో 50.05 అడుగుల ఎత్తుతో దేశంలోనే అత్యంత పెద్దదైన గోపురం.
- తెలంగాణ రాష్ట్రం లో బంగారు తాపడం కలిగిన మొట్టమొదటి దేవాలయంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిలిచిపోతుంది
- ఈ గోపురాన్ని స్వర్ణతాడపం చేసేందుకు 68 కిలోల బంగారాన్ని వినియోగించాం. చెన్నై స్మార్ట్ క్రియేషన్ సంస్థకు తాపడం పనులు అప్పగించాం.
- స్తపతి రవీంద్రన్ నేతృత్వంలో పనులు కొనసాగుతున్నాయి
- 108 మంది రుత్వికులతో ఐదు రోజులపాటు నారసింహ స్వామి మూర్తి మూల మంత్ర, స్తోత్రం, వేదాలతో పాటు రామాయణ, భారత ఇతిహాసాల పఠనం కొనసాగిస్తారు
- భక్తుల కోసం మాఢవీధులు, కొండ కింద వైకుంఠ ద్వారం, బస్టాండ్, వ్రత మండపాల్లో ఎల్ సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.