
తెలుగులో ఆది, లక్ష్మి, అదుర్స్, ఠాగూర్, మరిన్ని సూపర్ హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించిన ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ గురించి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. అయితే ఈమధ్య డైరెక్టర్ వివి వినాయక్ పలు వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీలో పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. దీంతో వివి వినాయక్ గురించి సోషల్ మీడియాలో లేనిపోని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా వివి వినాయక్ పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వార్తలపై డైరెక్టర్ వివి వినాయక్ పీఆర్ టీమ్ స్పందిచారు.
ఇందులో భాగంగా "ప్రముఖ దర్శకులు వివి వినాయక్ ఆరోగ్యం గా వున్నారు.. ప్రముఖ దర్శకులు వివి వినాయక్ గారు ఆరోగ్యం పై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారనీంక్లారిటీ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలని కోరారు. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో వివి వినాయక్ హెల్త్ గురించి వైరల్ అవుతున్న వార్తలకి పులిస్టాప్ పడింది.
ఈ విషయం ఇలా ఉండగా డైరెక్టర్ వివి వినాయక్ గత ఏడాది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేశాడు. కానీ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాకి ముందు తెలుగులో సాయి దుర్గ తేజ్ తో ఇంటెలిజెంట్ అనే సినిమా తీశాడు. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో మరో మంచి సాలిడ్ స్టోరీతో కంబ్యాక్ఇచ్చేందుకు కొంత బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం.