- నలుగురు డైరెక్టర్లు నట్టేట ముంచారు
- కంపెనీలో పెట్టుబడుల పేరుతో రూ.24 కోట్ల వసూల్
- భారీ రిటర్న్స్ వస్తాయని నమ్మి మోసపోయిన 120 మంది
- నిందితుల అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున రిటర్న్స్, ల్యాండ్ ఇస్తామని, దాదాపు 120 మంది నుంచి రూ.24 కోట్లు వసూలు చేసిన నలుగురిని సైబరాబాద్ఎకనామిక్ అఫెన్సెస్వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు అరెస్ట్‌చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ వివరాల ప్రకారం.. ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన బైర చంద్రశేఖర్ ముసాపేట్‌లో నివాసం ఉంటున్నాడు. కేపీహెచ్బీలో స్క్వేర్స్ అండ్ యార్డ్స్, యాడ్అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో రెండు కంపెనీలు ప్రారంభించాడు. వీటికి తనతోపాటు నార్సింగికి చెందిన వేములపల్లి జాన్వీ, కూకట్‌పల్లికి చెందిన గరిమెళ్ల వెంకట అఖిల్, మియాపూర్‌కు చెందిన రెడ్డిపల్లి కృష్ణ చైతన్య డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. కొంతకాలం పాటు ఆఫీస్‌ను కేపీహెచ్బీలో నిర్వహించి, ఆ తర్వాత మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌కు షిఫ్ట్ చేశారు. తమ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున రిటర్న్స్ఇస్తామని, దాంతో పాటు ల్యాండ్ కూడా ఇస్తామని వెబ్సైట్లో క్లాసిఫైడ్స్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్‌లో ఎర్రచందనం మొక్కలను నాటి, 13 ఏండ్ల తర్వాత ఈ చెట్ల ద్వారా వచ్చే లాభాల్లో 50 శాతం ఇస్తామని ఆశచూపారు.
ఆఫీస్ క్లోజ్ చూసి ఉండడంతో..
ఈ ప్రకటనలు చూసి కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన నాగరాజు వీరి కంపెనీలో రూ.17 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. ఈ పెట్టుబడులకు 100 నెలల పాటు నెలకు రూ.30 వేల చొప్పున రిటర్న్స్, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరిలో రెండు గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. రెండు, మూడు నెలల పాటు నాగరాజుకు నెలకు రూ.30వేల చొప్పున రిటర్న్ ఇచ్చి ఆ తర్వాత ఇవ్వడం మానేశారు. రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ గురించి తెలుసుకుంటే ఆ భూమి విలువ రూ. 3 లక్షల వరకే ఉండడం, రిటర్న్స్ ఇవ్వకపోవడంతో కంపెనీ ఆఫీస్‌కు వెళ్లగా, క్లోజ్ చూసి ఉండడంతో కంగుతిన్నాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం120 మంది బాధితుల వద్ద నుంచి వీరు రూ.24 కోట్ల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న చంద్రశేఖర్, జాన్వీ, వెంకట అఖిల్, కృష్ణచైతన్యను గురువారం అరెస్ట్ చేశారు.