- గ్రేటర్లో వెయ్యికి పైగా డేంజర్ స్పాట్స్
- యాక్సిడెంట్లు అవుతున్నా క్లీన్ చేయడంలో బల్దియా నిర్లక్ష్యం
హైదరాబాద్, వెలుగు:
గ్రేటర్రోడ్లపై మట్టి, ఇసుక, కంకర పేరుకుపోయి బైకులు స్కిడ్అవుతున్నాయి. వానల టైంలో ఎక్కడ ఉన్నాయో తెలియక జనం ప్రమాదాల బారిన పడగా, వానలు వెలిశాక కూడా అదే పరిస్థితి నెలకొంది. వరద నీరు పోయినా.. నీటితోపాటు వచ్చి మట్టి, ఇసుక ఎక్కడకక్కడ మేటలు వేస్తోంది. సిటీలో దాదాపు వెయ్యికి పైగా డేంజర్స్పాట్లు ఉన్నట్లు అంచనా. ఈ ప్రాంతాల్లో కనీసం రోజూ ఒకరు, కొన్నిసార్లు 5 నుంచి 10 మంది బైకులు స్కిడ్అయి కిందపడిపోతున్నారు. చిన్నపాటి గాయాలతో కొందరు బయటపడుతుండగా, కొన్నిసార్లు హాస్పిటల్స్‌లో అడ్మిట్అయ్యే పరిస్థితి ఉంటోంది. అక్కడ.. ఇక్కడ.. అని ఏం లేదు. కాలనీ రోడ్ల నుంచి మెయిన్‌రోడ్ల దాకా ఇదే పరిస్థితి ఉంటోంది. అత్యాధునిక వాహనాలతో రోజూ రోడ్లను క్లీన్ చేయిస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ చాలాచోట్ల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. వాన కురిస్తే వరద నీటితో మట్టి, ఇసుక రోడ్డుపైకి చేరుతోంది. రెండు, మూడురోజులకోసారి కూడా దాన్ని క్లియర్‌చేయడం లేదు. మరోవైపు భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో మరింత దారుణంగా ఉంటుంది. లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతోపాటు ఇతర వాహనాల్లో కంకర, ఇసుక, మట్టిని తరలిస్తున్నారు.
యాక్సిడెంట్లు ఇవి కూడా కారణమే.
బిల్డర్లు పట్టించుకోవట్లే
పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్లపై ఇసుక, మట్టి, కంకర పరిచనట్లు ఉంటోంది. ఈ విషయం తెలిసి కూడా బిల్డర్లు పట్టించుకోవడంలేదు. ఎవరో కిందపడితే తమకేంటనట్టు వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రోడ్లపైనే ఇసుక, కంకర కుప్పలుగా పోస్తున్నారు. చిన్నపాటి వాన కురిసినా నీటితో రోడ్లపైకి చేరుతున్నాయి. అటుగా వెళ్లే వాహనదారులు స్కిడ్అయి కింద పడిపోతున్నారు. ఇలాంటి సైట్లను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదు.
రోడ్లపైనే వ్యాపారం
చాలా ప్రాంతాల్లో మెయిన్‌రోడ్లపైనే ఇసుక, కంకర బిజినెస్ చేస్తున్నారు. రోడ్ల వెంట స్టోర్‌చేసి అమ్ముతున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లు ప్రమాదకరంగా తయారవుతున్నాయి. వనస్థలిపురం ఆటోనగర్ లోని విజయవాడ హైవే పక్కన ఇసుక లారీలు నిలుపుతున్నారు. అలాగే ఒక లారీలోంచి మరో లారీలోకి డంప్ చేస్తున్నారు. ఆ సమయంలో రోడ్లపై ఇసుక పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏడాది పొడవునా ఇదే సమస్య ఉంటోంది. బైకులు అదుపు తప్పి కిందపడి గాయాలపాలవుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. టోలిచౌకీ ఫ్లైఓవర్పక్కన కూడా ఇదే పరిస్థితి. ఏకండా రోడ్డు పక్కనే ఇసుకను కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 7, ఖైరతాబాద్, బండ్లగూడ, ఫతేనగర్ లలో రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయి.
ఏదైనా జరిగినప్పుడే హడావుడి..
గతేడాది జూబ్లీహిల్స్కేబుల్ బ్రిడ్జి సమీపంలో సినీ హీరో సాయిధరమ్‌తేజ్ బైక్ స్కిడ్ అయి కింద పడ్డాడు. ఆయన కింద పడటానికి స్పీడ్ఓ కారణమైతే, ప్రమాదం జరిగిన చోట రోడ్డుపై ఇసుక ఉండటం మరో కారణం. అప్పుడు స్పందించిన అధికారులు రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన ఓ కన్ స్ట్రక్షన్ బిల్డర్‌కి రూ.లక్ష జరిమానా విధించారు. మరికొందరికి కూడా అదే విధంగా వేశారు. తర్వాత అంతకు మించి ఇసుక, మట్టి పేరుకుపోతున్నా పట్టించుకోవడంలేదు. ఇసుక, కంకర తీసుకెళ్లే వాహనాలు ఓవర్ లోడ్ తో వస్తుండటంతో మెటిరీయల్ రోడ్లపై పడుతోంది. సిటీలో జరుగుతున్న యాక్సిడెంట్లలో ఎక్కువగా బైకులే ఉంటున్నాయి. 2020లో మూడు పోలీస్కమీషనరేట్ల పరిధిలో 7,573 ప్రమాదాలు జరిగితే ఇందులో 60 శాతం, 2021లో 8,565 ప్రమాదాలు జరగగా 65 శాతం బైకులు అదుపు తప్పి జరిగినవే ఉన్నాయి. ఈఏడాది ఇప్పటి వరకు 5 వేల వరకు ప్రమాదాలు జరగగా, సగానికి పైగా బైక్‌లపై జరిగినవే.
ప్రమాదాలకు జీహెచ్ఎంసీనే కారణం
సిటీలో రోజూ ఎంతో మంది ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్లపై మట్టి, ఇసుక, కంకర చేరుతుండటంతో బైకులు స్కిడ్ అయి కిందపడిపోతున్నారు. ప్రమాదాలకు జీహెచ్ఎంసీనే కారణం. వానలు తెరిపిచ్చాక స్పెషల్ టీమ్స్పెట్టి ఎప్పటికప్పుడు రోడ్లను క్లీన్ చేయించాలె. లేకపోతే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. వరద పోయాక మట్టి, ఇసుక కుప్పలుగా పేరుకుపోతుంది. డేంజర్స్పాట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. - అబ్దుల్ రెహమాన్, సోషల్ యాక్టివిస్ట్
ప్రమాదాలకు జీహెచ్ఎంసీనే కారణం
సిటీలో రోజూ ఎంతో మంది ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్లపై మట్టి, ఇసుక, కంకర చేరుతుండటంతో బైకులు స్కిడ్ అయి కిందపడిపోతున్నారు. ప్రమాదాలకు జీహెచ్ఎంసీనే కారణం. వానలు తెరిపిచ్చాక స్పెషల్ టీమ్స్పెట్టి ఎప్పటికప్పుడు రోడ్లను క్లీన్ చేయించాలె. లేకపోతే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. వరద పోయాక మట్టి, ఇసుక కుప్పలుగా పేరుకుపోతుంది. డేంజర్స్పాట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. - అబ్దుల్ రెహమాన్, సోషల్ యాక్టివిస్ట్