కామారెడ్దిలో దివ్యాంగులకు ఆసరా కష్టాలు

కామారెడ్డి, వెలుగు :  
దివ్యాంగులకు ఆసరా ఫించన్లు అగిపోతే తిరిగి పునరుద్దరణకు కష్టాలు ఎదురవుతున్నాయి.   కొందరు దివ్యాంగులకు  వారి పరిస్థితిని బట్టి మెడికల్ బోర్డు  కొన్నేండ్ల కాల పరిమితితోనే  సర్టిఫికేట్లు జారీ చేస్తుంది. పుట్టుకతోనే వివిధ రకాల  సమస్యలతో ఉన్న వారికి కూడా 5 ఏండ్ల వ్యవధితో సర్టిఫికెట్లనే జారీ చేస్తున్నారు.  అయితే ఇలాంటి వారు మళ్లీ సదరం సర్టిఫికెట్ల      కోసం    తిప్పలు పడాల్సి వస్తోంది.  కామారెడ్డి జిల్లాలో  పలువురు ఫించన్లు అగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. 

పరిస్థితి ఇది...

పుట్టుకతో  మాట్లాడలేని వారు,   నడవలేని వారు, చెవిటి వారు 90 శాతంకు పైగా ఉన్నారు. కానీ  సదరం  క్యాంపుల్లో   మెడికల్ బోర్డు కొందరికి  5 ఏండ్ల తర్వాత తిరిగి వెరిఫికేషన్​ చేయాలని పేర్కొంటుంది. సర్టిఫికెట్​ పొందిన తర్వాత  ఫించన్​కు అప్లయ్​ చేస్తే  శాంక్షన్​ చేస్తారు. సర్టిఫికెట్​లో పేర్కొన్న ప్రకారం  గడువు కంప్లీట్​కాగానే అటోమెటిక్​గా ఫించన్​ అగిపోతుంది.  వీరు ఆఫీసర్ల చుట్టూ తిరిగితే కానీ అసలు విషయం తెలియటం లేదు.  మళ్లీ సదరం క్యాంపులకు వెళ్లి సర్టిఫికేట్​ తేవాలని సూచిస్తున్నారు.  క్యాంపులకు వెళ్తామంటే ఆన్​లైన్లో  టోకెన్లు దొరకటంలేదు. ప్రతి సోమవారం  కలెక్టరేట్ లో  జరిగే ప్రజావాణికి  పలుమార్లు వచ్చి  తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.   పుట్టుకతో  సమస్యలు ఉన్న వారికి కూడా  గడువుతో  కూడిన సర్టిఫికెట్లు ఇస్తున్నారని,  మధ్యలో  ఫించన్లు అగిపోతుండటంతో వారు  ఇబ్బందులకు గురవుతున్నారని  ఏప్రిల్20న  జరిగిన జడ్పీ మీటింగ్​లో పలువురు సభ్యులు పేర్కొన్నారు.  నెలల తరబడి ఆన్​లైన్లో స్లాట్​ దొరకటం లేదని,  మెడికల్ బోర్డులో  ఒకసారి రిజెక్ట్​ అయితే మరోసారి అప్లయ్ చేస్తే టోకేన్​ రావటం లేదని పలువురు పేర్కొన్నారు. 

కామారెడ్డి జిల్లాలో

జిల్లాలో 18,896 మంది  దివ్యాంగులకు ఆసరా ఫించన్​ వస్తున్నది.   ఇందులో  250 నుంచి  300 మంది వరకు దివ్యాంగుల ఫించన్లు  కొన్ని నెలలుగా నిలిచిపోయాయి.  వీరు మళ్లీ సదరం క్యాంపులకు వెళ్లి సర్టిఫికెట్ పొంది ఆన్​లైన్​ లో అప్లయ్​ చేస్తే అప్రూవల్​ వచ్చిన తర్వాత వీరికి  మళ్లీ  ఫించన్​ వస్తుంది. ఈ పక్రియ జరగటానికి  కొన్ని నెలలు పడుతోంది. ఈ టైంలో ఫించన్​ రాక బాధితులు అవస్థలు పడుతున్నారు. 
'  ఈ  ఫోటోలో ఉన్నది  లింగంపేట మండలం మంబోజిపేటకు చెందిన తల్లీబిడ్డలు  స్రవంతి, సాయవ్వ.  పోషయ్య, సాయవ్వలకు ఒక కొడుకు, ఒక బిడ్డ .13 ఏండ్ల  స్రవంతికి పుట్టుకతోనే  మాటలు రాలేదు. 2017 డిసెంబర్​ 20నన  కామారెడ్డి జిల్లా హాస్పిటల్​లో  సదరం క్యాంపులో  90  శాతం దివ్యాంగురాలిగా సర్టిఫికెట్​ ఇచ్చారు.  5 ఏండ్ల తర్వాత  మళ్లీ  వెరిఫికేషన్​చేయాలని అందులో  పేర్కొన్నారు.  అమ్మాయిలో  ఎలాంటి  మార్పు లేదు.  సదరం సర్టిఫికేట్​ వచ్చిన తర్వాత ఆసరా ఫించన్​కు అప్లయ్​ చేస్తే శాంక్షన్​ అయ్యింది. అయితే 5 నెలల నుంచి ఆసరా  ఫించన్​ అగిపోయింది.  ఆఫీసర్ల దగ్గరకు వెళ్లి అడిగితే  మళ్లీ  పరిశీలన చేయాలని ఉందని మళ్లీ  సదరం క్యాంపునకు వెళ్లి  సర్టిఫికెట్​ తీసుకురావాలని సూచించారు. ఆన్​లైన్లో స్లాట్​ దొరకటం లేదు.  తమ బిడ్డ బాధ చూసి  ఫించన్​ వచ్చేలా చూడాలని  కలెక్టరేట్​లో జరిగిన ప్రజావాణికి బిడ్డతో వచ్చి తల్లి  ఫిర్యాదు చేశారు. 

సమస్యలు లేకుండా చూస్తున్నాం

దివ్యాంగులకు  ఫించన్ల విషయంలో  ఎలాంటి సమస్యలు రాకుండాచూస్తున్నాం.   సదరం సర్టిఫికేట్​లో  కొందరికి  రీ అసైన్​మెంట్​ పేర్కొన్న వారికి గడువు కంప్లీట్​ రాగానే  ఫించన్​ అగిపోతుంది. ఇలాంటి వారు మళ్లీ  సదరం క్యాంపునకు హాజరై సర్టిఫికేట  తీసుకొని అన్​లైన్లో అప్లయ్​ చేస్తే  ఫించన్​ పునరుద్ధరణ జరుగుతుంది. 
- సాయన్న, డీఆర్​డీవో, కామారెడ్డి జిల్లా