ఫ్యూచర్ జెనరాలి నుంచి డిజిబిలిటీ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ ప్రొటెక్షన్

ఫ్యూచర్ జెనరాలి నుంచి డిజిబిలిటీ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ ప్రొటెక్షన్

హైదరాబాద్​, వెలుగు: ఫ్యూచర్ జెనరాలి ఇండియా ఇన్సూరెన్స్ (ఎఫ్​జీఐఐ) తన వినియోగదారులకు వైకల్యం సంభవించినప్పుడు ఆర్థిక భద్రతను అందించడానికి డిజబిలిటీ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ ప్రొటెక్షన్ బీమాను ప్రారంభించింది.   తమ ఉద్యోగులకు ఆదాయం ఆగిపోతే యజమానులు వారికి సాయం చేయాలన్నదే ఈ పాలసీ  ప్రాథమిక లక్ష్యమని తెలిపింది. ఈ పాలసీ వల్ల బాధితులు వైకల్యం బారిన పడినా అవసరమైన ఖర్చులకు డబ్బులు వస్తాయి.

 ఈ బీమా పథకం  తాత్కాలిక,  శాశ్వత వైకల్యాలను కవర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్టని ఫ్యూచర్ జెనరాలి ఇండియా ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్  రమిత్ గోయల్ చెప్పారు.  ఎఫ్​జీఐఐ దేశవ్యాప్తంగా ఉద్యోగులకు ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు.