
శరీరంలో అన్ని అవయవాలు సరిగా ఉండీ... ఏ పనీ చేయకుండా.. అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ఉండే వాళ్లు కొంతమందుంటారు. కానీ ప్రతిభకు అంగవైకల్యం అడ్డు కాదంటూ.. రెండు కాళ్లూ చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఉన్న ఓ యువకుడు మాత్రం తన టాలెంట్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఖమ్మంకి చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టిన అరుణ్ కుమార్ అనే ఓ యువకుడు పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టాడు. కాళ్లు సరిగా లేకున్నా ఎప్పుడూ మనోధైర్యాన్ని కోల్పోకుండా తనకెంతో ఇష్టమైన డాన్స్ నేర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా.. ఆ విద్యను ఇతరులకు నేర్పుతూ... మాస్టర్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించు కోవడానికి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో పార్కింగ్ కూలీగా పనిచేస్తున్నాడు. అంతే కాదు తన ప్రతిభను గుర్తించిన నటుడు లారెన్స్... పలు సినిమాల్లోనూ అవకాశం కల్పించాడు.
ఇలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగపరుచుకుంటూ.... తాజాగా ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమం లో డాన్స్ మాస్టర్ గంటసాల పవన్ ద్వారా చిన జీయర్ స్వామివారిని కలిశారు. స్వామి ఆశీస్సులు తీసుకొని ఆయన ముందు కూడా డాన్స్ వేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. రెండుకాళ్ళ లేకపోయినా అద్భుతంగా డాన్స్ వేస్తున్న అరుణ్ ని చూసి చినజీయర్ అభినందించారు.