దివ్యాంగుల చలో ఢిల్లీ

దివ్యాంగుల చలో ఢిల్లీ

బోధన్, వెలుగు: బోధన్​డివిజన్​లోని దివ్యాంగులు శుక్రవారం చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఈసందర్భంగా దివ్యాంగుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి యేశాల గంగాధర్​ మాట్లడుతూ.. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 10న ఢిల్లీలో మహా ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని, ధర్నాలో పాల్గొనేందుఉ బయలుదేరి వెళ్తున్నట్లు చెప్పారు.

 కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు కేవలం రూ.300 ఫించన్​ఇస్తోందని, కనీసం నెలకు రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి దివ్యాంగుడికి ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పని కల్పించాలన్నారు. దివ్యాంగుల ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల రుణం ఇవ్వాలని, దివ్యాంగుల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకమైన స్కూల్స్ నిర్మించాలని డిమాండ్​చేశారు. ఢిల్లీకి బయలుదేరిన వారిలో బోధన్​పట్టణ ప్రధాన కార్యదర్శి గంపల శంకర్, జిల్లా కోశాధికారి రామ్ పటేల్, నాగనాథ్​పటేల్, ఎల్లయ్య, చింటూ, సాయినాథ్, జగన్​ తదితరులున్నారు.