మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కుమారుడు, వంశీ కృష్ణ చెన్నూరులో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో చెన్నూరు మండలం క్యాథన్ పల్లి మున్సిపాలిటీకి చెందిన మేడిపట్ల సతీష్ అనే దివ్యాంగుడు.. తనను ఆదుకోవాలంటూ వంశీకృష్ణను కలిశారు. ఎన్నో ఏళ్లుగా దివ్యాంగుల హక్కులు, సంక్షేమం కోసం పోరాడుతున్నానని.. రెండు చేతులు లేకపోయినా.. మనోధైర్యంతో ముందుకు సాగుతున్నట్లు వంశీకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు సతీష్.
మాజీ ఎంపీ వివేక్ తో పాటు, రాష్ట్ర గవర్నర్ తమిళిసై, రాహుల్ గాంధీలను గతంలో కలిసిన ఫొటోలను చూపించారు సతీష్. చైతన్య దివ్యాంగుల వేదిక ద్వారా హక్కుల కోసం పోరాటం చేస్తున్న విషయాలను వివరించారు సతీష్. వారి డిమాండ్లు, సమస్యలు, కావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలు, అంశాలను సతీష్ నుంచి వివరంగా తెలుసుకున్నారు వంశీకృష్ణ. ఈ సందర్భంగా సతీష్ కు, దివ్యాంగులకు సంబంధించిన విషయాల్లో అండగా ఉంటానని హామీ ఇచ్చారు వంశీ కృష్ణ.
Also Read :- ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులు
నవంబర్ 1న మాజీ ఎంపీ వివేక్ తో పాటు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వంశీ కృష్ణ చెన్నూరు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.