చీరకట్టుతో ఆర్టీసీ బస్సు ఎక్కి దివ్యాంగుల నిరసన

హైదరాబాద్: మహాలక్ష్మి స్కీం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. పురుషులకు సీట్లు లేకుండా పోతుండటంతో వారు నిలబడే జర్నీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాలో దివ్యాంగులు వినూత్న నిరసన చేపట్టారు. వర్ధన్నపేట పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో తమకు కేటాయించిన సీట్లలో మహిళలకు కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి వల్ల ఆర్టీసీ బస్సు ఎక్కని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. అందుకే తమకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి.. 3 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ALSO READ | కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకులు.. జగిత్యాలలో దారుణం