ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ఇచ్చిన హామీలను అమలు చేయాలి
  • మెదక్, సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసుల ఎదుట వికలాంగుల ధర్నా

మెదక్​టౌన్​, వెలుగు : ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్​ మంజూరు చేయాలని, జీవో నెంబర్​ 17ను రద్దు చేయాలని, డిమాండ్​ చేస్తూ సోమవారం మెదక్​ జిల్లా కలెక్టరేట్​ఎదుట వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముత్యాలు 

యశోద మాట్లాడుతూ.. జిల్లాలో 51,645 మంది లబ్ధిదారులకు పెంచిన పింఛన్​ ఇవ్వాలని, కొత్తగా పింఛన్ కోసం 4,685 మంది లబ్ధిదారులు సదరమ్​ క్యాంపు ద్వారా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అనంతరం జిల్లా అడిషనల్​ కలెక్టర్​నగేశ్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్, కిష్టయ్య, చంద్రం, దుర్గ, స్వరూప, భాగ్య, శ్రీను, కవిత పాల్గొన్నారు. 

సంగారెడ్డి టౌన్ : వికలాంగుల పింఛన్​రూ.6000 కు పెంచి వెంటనే అమలు చేయాలని ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్​ఎదుట ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్​క్రాంతికి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వికలాంగులు మీడియాతో మాట్లాడుతూ..పెన్షన్ల పెంపు కోసం 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు, కొత్త పెన్షన్ల మంజూరు కోసం 24 లక్షల 85 వేల మంది ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని

 వికలాంగుల బ్యాక్​లాగ్​పోస్టులను గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బసవరాజు, కార్యదర్శి నరసింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశం, కోశాధికారి ఇస్మాయిల్, లలిత, రామ్​చందర్, అశ్వ కుమార్, శోభమ్మ , సంగమేశ్, సత్యనారాయణ, మచ్చేందర్, కృపవరం, కృష్ణ   తదితరులు పాల్గొన్నారు.