దివ్యాంగులు ఆర్థికంగా ఎదగాలి: మంజుల రమేశ్

దివ్యాంగులు ఆర్థికంగా ఎదగాలి: మంజుల రమేశ్

వికారాబాద్, వెలుగు: స్వయం ఉపాధితో దివ్యాంగులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజులారమేశ్ అన్నారు. పట్టణంలోని క్లబ్ హాల్లో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఫౌండేషన్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ గురుదేవి మాట్లాడుతూ..  స్వయం ఉపాధికి జిల్లాలో అర్హులైన 212 మంది దివ్యాంగులకు రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్​మాజీ వైస్​ చైర్మన్​ చిగుర్లపల్లి రమేశ్​కుమార్, మండల పరిషత్​ మాజీ కో ఆప్షన్​ మెంబర్​ జాఫర్, ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ రామేశ్వర్, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింలు, కమ్యూనిటీ వాలంటీర్లు తదితరులు  పాల్గొన్నారు.