
చేతులు లేకపోయినా ఓ విద్యార్థి కాళ్లతో పరీక్షలు రాసి తోటి విద్యార్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కుషనపల్లికి చెందిన ఎల్లూరి శంకర్ తొమ్మిదోవ తరగతి చదువుతుండగా విద్యుత్‌షాక్‌తో తన రెండు చేతులను కోల్పోయాడు. నాటి నుంచి నేటి వరకు పట్టువీడకుండా ఆత్మస్థైర్యంతో చదువుతూ డిగ్రీ వరకు చేరుకున్నాడు. ప్రస్తుతం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ ఫస్టియర్చదువుతున్నాడు.
కాగా, ఇవాళ డిగ్రీ ఫస్ట్సెమిస్టర్పరీక్షలు ఉండడంతో ఎగ్జామ్ సెంటర్ అయిన స్థానిక భవిత డిగ్రీ కళాశాలకు చేరుకొని కాళ్లతో పరీక్ష రాశాడు. తను ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం ఉందని శంకర్తెలిపాడు. అయితే, శంకర్ సంబంధిత వివరాలను భవిత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కన్నారావు తెలిపారు.