బీఆర్ఎస్ అధిష్టానానికి అసంతృప్తుల తలనొప్పి

బీఆర్ఎస్ అధిష్టానానికి అసంతృప్తుల తలనొప్పి ఎక్కువైంది. ప్రగతి భవన్ చర్చ లో కాంప్రమైజ్ అంటున్న నేతలు... నియోజకవర్గాల్లోకి వెళ్ళిన తర్వాత నై అంటున్నారు. 

మంత్రి కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్ పుర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరం ఒకటేనని చెప్పారు.  అయితే నియోజకవర్గానికి వెళ్లిన తర్వాత కేటీఆర్ సమక్షంలో రాజీ కుదరలేదన్నారు ఎమ్మెల్యే రాజయ్య . 

ALSO READ : పార్టీని నమ్ముకున్న వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తాం : మధుయాష్కీ గౌడ్

స్టేషన్ ఘన్ పూర్ ఒక్కటే కాదు మహబూబాబాద్, జనగామ, కోదాడ వంటి కొన్ని నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తి ఎక్కువగా ఉంది. మరోవైపు పేర్లు ప్రకటించగానే టికెట్‌ ఫైనల్‌ అయినట్టు కాదని, భవిష్యత్తులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉండనుందనే ఎమ్మెల్యే రాజయ్య అంటున్నారు.