భద్రాచలం ఏరియా హాస్పిటల్​లో స్టాప్ మధ్య విభేదాలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్ మధ్య అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. పరస్పర ఆరోపణలతో జిల్లా కలెక్టర్, ఎస్పీకి సూపరింటెండెంట్​ డాక్టర్​.రామకృష్ణపై ఫిర్యాదు చేశారు. దీంతో డీఎం అండ్ హెచ్​వో డా.శిరీష బుధవారం భద్రాచలం వచ్చారు. భద్రాచలం, పాల్వంచ డిప్యూటీ డీఎంఅండ్​హెచ్ వోలతో కలిసి ఏరియా ఆసుపత్రిలో ఎంక్వైరీ చేశారు.

వేధింపుల నేపథ్యంలో కంప్లెంట్​అందడంతో శానిటేషన్ ​స్టాఫ్​తో పాటు స్టాఫ్​నర్సులు, లేడీ డాక్టర్లను పిలిచి వివరాలు సేకరించారు. కరోనా టైంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రెమ్డిసివిర్​ ఇంజెక్షన్ల కుంభకోణంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రి వార్తల్లోకి ఎక్కింది. ఆ సమయంలో సూత్రధారులను సస్పెండ్ చేశారు. కానీ తిరిగి వారు ఇదే ఆసుపత్రిలో విధుల్లో చేరారు. ఈ విషయంలోనూ కంప్లెంట్​చేయడంతో అన్ని ఫిర్యాదులపై విచారణ కొనసాగిస్తున్నారు.