రేవంత్ కు రాజకీయ ఝలక్ ఇస్తా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విబేధాలు తారాస్థాయికి చేరాయి. రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీలోని నేతలందరినీ కలుపుకుపోయే తత్వం రేవంత్ కు లేదన్నారు. ఆయన ఇష్టానుసారంగా ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్, సోనియా, రాహుల్ కుటుంబంతో ఇబ్బంది లేదన్నారు. తనకు రేవంత్ కు మధ్యనే పంచాయితీ ఉందన్నారు. ఇటీవల రేవంత్ మెదక్ వెళ్తున్న సందర్భంలో తనకు ఫోన్ చేసి వెళ్తున్నా అని సమాచారం మాత్రమే ఇచ్చారని..రమ్మని పిలవలేదన్నారు. దామోదర రాజనర్సింహకి ఫోన్ చేసి మెదక్ కి రమ్మని రేవంత్ పిలిచారని..దాంతో తాను మనస్థాపానికి గురైయ్యానని చెప్పారు. 

రాజకీయంగా కేసీఆర్ తో ఎలాంటి గొడవలు లేవన్నారు జగ్గారెడ్డి. తాను పీసీసీ కావాలని కోరుకున్నానని చెప్పారు. తాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతానని..అందుకే కొందరు సీనియర్లు తనతో మాట్లాడేందుకు భయపడుతున్నారన్నారు. తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని..తాను కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పారు. రేవంత్ కు రాజకీయ ఝలక్ ఎలా ఇవ్వాలో తనకు బాగా తెలుసన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి తనను బుజ్జగించినట్లు ప్రచారం చేశారని..అందంతా పచ్చి బూటకమన్నారు. సీఎల్పీ మీటింగ్ తర్వాత ఒంటరిగా గదిలోకి పిలిపించుకుని సీఎం సీరియస్ గా ఉన్నారని..ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని చెప్పారని తెలిపారు. అసలు సీఎంకు సీరియస్ గా ఉంటే అసెంబ్లీ నడుస్తదా అని ప్రశ్నించారు.చంద్రబాబు రేవంత్ కు సరైన స్థాయిలో రాజకీయ శిక్షణ ఇవ్వలేదన్నారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే తనకు శీల పరీక్ష అని..ఒక్కమాటలో చెప్పాలంటే ముత్యాల ముగ్గు సినిమాలో తాను హీరోయిన్ ..రేవంత్ రెడ్డి విలన్ గా ఉందన్నారు. 

మరిన్ని వార్తల కోసం

సామాన్యులకు షాక్.. పెరిగిన వంట గ్యాస్ ధర

లవ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌తో ఐశ్వర్య బాలీవుడ్ ఎంట్రీ