సౌదీలో జగిత్యాల జిల్లావాసి అదృశ్యం

సౌదీలో జగిత్యాల జిల్లావాసి అదృశ్యం

జగిత్యాల జిల్లా  బీర్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన ఓ వలస జీవి  సౌదీలో అదృశ్యమయ్యాడు. ఏడు నెలలుగా ఆచూకీ లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బీర్పూర్ కు చెందిన కందుల తిరుపతి(35) అనే వ్యక్తి సౌదిలోని జిద్దాలోని గ్రీన్‌ రెడ్‌ కంపనీలో పని చేసేందుకు 2023 డిసెంబర్‌లో వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న తిరుపతి ఏడూ నెలలుగా ఆచూకీ లేకపోవడంతో అదృశ్యం అయినట్లు కుటంబ సభ్యులకు సమాచారం అందింది.

 పొట్టపూటి కోసం వెళితే కానరాకుండా పోవటంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. గతేడాది డిసెంబర్ లో అనారోగ్యంతో బాధపడుతున్నానని ఇంటికి వెళ్లాలని కంపెనీ ప్రతినిధితో గొడవ పడ్డట్లు చెప్పిన తిరుపతి కుటుంబ సభ్యులు. గతేడాది డిసెంబర్ 7వ తారీఖున చివరిసారిగా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన తిరుపతి. కంపెనీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడిన సరైన సమాధానం చెప్పడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తిరుపతికి తల్లిదండ్రులతో పాటు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తిరుపతి ఆచూకీ లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.