జగిత్యాల జిల్లాలో తల్లీకూతుళ్ల అదృశ్యం కలకలం రేపుతోంది. మల్యాలకు చెందిన అలేఖ్య అనే మహిళ తన నాలుగేళ్ల కూతురితో అదృశ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలేఖ్యకు నాలుగేళ్ల క్రితం నాందేడ్ కు చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే వారి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని సమాచారం. దీంతో గత ఆరు నెలలుగా భర్తను వదిలి ఆమె విడిగా ఉంటోంది. ఎప్పటిలాగే స్కూల్లో ఉన్న కూతురుకు అలేఖ్య భోజనం తీసుకెళ్లగా.. ఆ తర్వాత నుంచి ఇద్దరు కన్పించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.