
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: ఇద్దరు పిల్లలతో సహా తల్లి కనిపించకుండా పోయిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన కస్తూర్రామ్8 ఏళ్ల క్రితం దోమడుగు గ్రామానికి వచ్చి వినాయక విగ్రహాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి మూడో కూతురు సంగీతను కొన్నేళ్ల క్రితం కాలురాం కు ఇచ్చి పెళ్లి చేశాడు.
వారికి 9 సంవత్సరాల పాప, 12 సంవత్సరాల బాబు ఉన్నారు. రెండు నెలల క్రితం కూతురును విడిచి పెట్టి అల్లుడు వెళ్లిపోయాడు. ఈ నెల 16న రాత్రి నుంచి కూతురు సంగీత, మనువడు ప్రవీన్, మనువరాళు సుందరి కనిపించడంలేదు. చుట్టు పక్కల, బంధువుల దగ్గర వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.