
అంటాల్యా (టర్కీ): వరల్డ్ కప్ స్టేజ్–3లో ఇండియా రికర్వ్ ఆర్చర్లు నిరాశపర్చారు. ఒక్కరు కూడా మెడల్ సాధించలేకపోయారు. అయినా పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌కు చేరువగానే ఉన్నారు. గురువారం జరిగిన సెమీస్‌లో భజన్ కౌర్–దీపికా–అంకితా భాకట్‌తో కూడిన ఇండియా త్రయం 4–5తో ఫ్రాన్స్ చేతిలో ఓడింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో ఇండియా 5–3తో ఉక్రెయిన్‌ను ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
ఇక బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లోనూ ఇండియా 0–6తో జపాన్ చేతిలో చిత్తయ్యారు. ధీరజ్–తరుణ్‌దీప్ రాయ్–ప్రవీణ్ జాదవ్‌తో కూడిన ఇండియా మెన్స్ టీమ్ కూడా 1–5తో నెదర్లాండ్స్ చేతిలో కంగుతిన్నది. స్టేజ్–3 పూర్తయ్యేసరికి ఇండియా విమెన్స్ టీమ్ 4వ ప్లేస్‌లో నిలిచింది. సోమవారం పారిస్ ఒలింపిక్స్ కటాఫ్ ర్యాంకింగ్స్ వరల్డ్ ఆర్చరీ ప్రకటించనుంది. కొత్త రూల్స్ ప్రకారం ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో కోటాను సాధించలేకపోయిన తొలి 2 దేశాలకు పారిస్ బెర్త్‌లను కేటాయిస్తారు.