బడ్జెట్​పై మార్కెట్లలో నిరాశ

బడ్జెట్​పై మార్కెట్లలో నిరాశ
  • సెన్సెక్స్ 280 పాయింట్లు డౌన్​
  • 65 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ముంబై: మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. ఎఫ్​అండ్​ఓ సెక్యూరిటీల లావాదేవీల పన్ను పెంపుతోపాటు షార్ట్​టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్​ను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఆర్థిక,  బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దీని కారణంగా బెంచ్‌‌‌‌మార్క్ బీఎస్​ఈ సెన్సెక్స్ బుధవారం నష్టపోయింది. ఇది 280.16 పాయింట్లు క్షీణించి 80,148.88 వద్ద స్థిరపడింది. 

సెన్సెక్స్​లోని 19 షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో 678.53 పాయింట్లు   క్షీణించి 79,750.51 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 65.55 పాయింట్లు పడిపోయి 24,413.50 వద్దకు చేరుకుంది. బజాజ్ ఫిన్సర్వ్ మొదటి త్రైమాసిక ఆదాయాలు పెట్టుబడిదారులను మెప్పించకపోవడంతో 2 శాతం క్షీణించింది. బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనుకబడ్డాయి.

 అయితే టెక్ మహీంద్రా, ఐటీసీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి.  బడ్జెట్‌‌‌‌లో పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను వేయకపోవడంతో ఐటీసీ 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. బీఎస్​ఈ స్మాల్‌‌‌‌క్యాప్ గేజ్ 1.91 శాతం,  మిడ్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.68 శాతం పెరిగింది.  ఇండెక్స్‌‌‌‌లలో బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో వెనుకబడి ఉన్నాయి.  ఎనర్జీ, హెల్త్‌‌‌‌కేర్, ఇండస్ట్రియల్స్, యుటిలిటీస్, టెలికమ్యూనికేషన్,  పవర్ లాభపడ్డాయి.   ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై  హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌‌‌‌ఐఐలు  మంగళవారం రూ. 2,975.31 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.